స్టార్ డైరెక్టర్ తో విశ్వక్ కొత్త సినిమా.. ప్లాన్ అదిరిందిగా..!?

Anilkumar
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే ”మెకానిక్ రాకీ” చిత్రాన్ని శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న విశ్వ‌క్, త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ గా ”లైలా” మూవీని అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విశ్వ‌క్ ఓ అమ్మాయి గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ సినిమా త‌రువాత త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కూడా విశ్వ‌క్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. #vS13 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ పోస్టర్‌ విడుదల చేశారు. శ్రీధర్‌ గంట దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. 'కాంతార' మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ దీనికి స్వరాలు

 అందించనున్నారు. పోస్టర్‌ చూస్తే ఇందులో విష్వక్‌ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ఇది రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. ప‌వ‌ర్ఫుల్ యాక్ష‌న్ డ్రామాగా ఈ సినిమాను మేక‌ర్స్ రూపొందించ‌నున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యానర్ పై సుధాక‌ర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి అజ‌నీష్ లోక్నాథ్ సంగీతం అందించ‌నున్నాడు.  ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్  రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. రవితేజ ముళ్లపూడి

 దర్శకత్వంలో 'మెకానిక్‌ రాకీ'లో నటిస్తున్నారు. రాకీగా మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ మాస్‌ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. దీనితో పాటు ఇటీవల 'లైలా' (Laila) అనే కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విభిన్నమైన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు కూడా ప్రాధాన్యముందని సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: