డబ్బుల్లేక రూమ్ ఖాళీ చేయగా.. సునీల్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన త్రివిక్రమ్..?

Suma Kallamadi
కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్‌ సినిమాల్లో సక్సెస్ అయ్యాడంటే దానంతటికీ కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరూ సినిమాలోకి రాకముందు నుంచే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. త్రివిక్రమ్ తన టాలెంట్ తో రచయిత, డైరెక్టర్ అయ్యాడు. ఆయన తన సినిమాల్లో సునీల్ కి అవకాశాలు ఇచ్చాడు. సునీల్ కోసం ప్రత్యేకంగా పాత్రలు రాసి అతన్ని బాగా హైలైట్ చేశాడు. సునీల్ కూడా చాలా టాలెంటెడ్ కమెడియన్ అని చెప్పుకోవచ్చు. అందుకే త్రివిక్రమ్ రాసిన క్యారెక్టర్లలో ఇరగదీసి టాప్ కమెడియన్ అయిపోయాడు.
గతంలో వీరిద్దరూ హైదరాబాద్‌ వచ్చి ఒకే రూమ్‌ ఉంటూ సినిమా అవకాశాల కోసం ట్రై చేశారు. అయితే ఇంత ట్రై చేసినా వారికి వెంటనే అవకాశాలు రాలేదు   మరోవైపు నుంచి జేబులో డబ్బులు అన్ని ఖాళీ అయిపోయాయి. ఆ పరిస్థితుల్లో రెంటు కట్టలేక రూమ్ ఖాళీ చేశారు. అలాంటి దరిద్రంలో త్రివిక్రమ్ చేసిన ఒక పని తనకు ఆశ్చర్యం కలిగించిందని సునీల్ తాజాగా చెప్పుకొచ్చాడు.
''త్రివిక్రమ్‌, నేనూ కలిసి లక్డీకపూల్‌లో ఓ రూమ్ రెంట్‌కి తీసుకున్నాం. ఒకానొక దశలో రెంట్‌ కట్టడానికి మనీ లేని పరిస్థితికి చేరుకున్నాము. ఇక రూమ్ ఖాళీ చేసే వెళ్లిపోక తప్పదు అని అర్థం అయింది. నా పాత బట్టల్లో చెక్ చేస్తే మొత్తం రూ.12 దొరికాయి. ఆ తర్వాత లగేజ్‌ పట్టుకుని, బస్టాప్‌కు బయలుదేరాం. రాత్రి 9 గంటలకు మేం వెళ్లాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే అప్పట్లో రూ.3కే దిల్‌ ఖుష్ ఐటమ్ వచ్చేది. ఆ రాత్రికి చెరొకటి తిని కొద్దిగా వాటర్ తాగి ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి నిద్రపోదాం అనుకున్నాం. అప్పట్లో ప్లేట్‌ ఇడ్లీ కూడా మూడు రూపాయలు పెడితే వచ్చేది. దానివల్ల ఉదయానికి కూడా తినడానికి డబ్బులు ఉన్నాయని నేను అనుకున్నాను. అదే విషయాన్ని త్రివిక్రమ్ కి చెప్పాను. రేపు ఉదయం తర్వాత నుంచి డబ్బు సంపాదించడానికి ఆలోచించాలి త్రివిక్రమ్ అని అన్నాను." అని సునీల్ చెప్పాడు.
 ఇంకా మాట్లాడుతూ "నేను చెప్పిన మాటలన్నీ త్రివిక్రమ్ తాపీగా విన్నాడు. తర్వాత నా దగ్గర ఉన్న 12 రూపాయలు ఇవ్వమని అన్నాడు. మొదటగా అతడు ఆ డబ్బులు ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాలేదు. సందేహంతోనే డబ్బులు ఇచ్చాను. వాటిని పట్టుకెళ్ళి పక్కనే ఉన్న షాప్ లో కోకోకోలా టిన్ కొనుగోలు చేశాడు. దాని ధర 12 రూపాయలు. 'నువ్వు కొంచెం తాగి, నాకు కొంచెం ఇవ్వు' అని అన్నాడు. దాంతో నాకు మతిపోయింది. కడుపునిండా టిఫిన్ చేయడానికి ఉపయోగపడే డబ్బులను ఇలా కోక్ బాటిల్ కొని నాశనం చేశాడు. అందుకే నాకు అతను ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. అప్పుడు 'నువ్వు రేపటి నుంచి ఏం చేయాలో ప్లాన్ చేశావు. అదే ఈ డబ్బు ఖర్చు అయిపోతే ఇప్పటినుంచే మనీ ఎలా సంపాదించాలో మనకు ఆలోచనలు మొదలవుతాయి. అలాగే నువ్వు ఆలోచించు' అని త్రివిక్రమ్‌ అన్నాడు." అని సునీల్ చెప్పుకొచ్చాడు. ఆనాడు జరిగిన ఇలాంటి సంఘటనలు గుర్తుచేసుకొని సునీల్ త్రివిక్రమ్ ఆలోచనలు అలా ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరూ కెరీర్ లైఫ్ లో బాగా సెటిల్ అయ్యారు. డబ్బుకు ఎలాంటి కొదవ లేకుండా హాయిగా జీవితాన్ని సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: