సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు అనేది సర్వసాధారణం. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది సినీ ప్రేక్షకులు సినిమాలు చూడాలంటే ఖచ్చితంగా అందులో రొమాంటిక్ సన్నివేశాలు ఉండాల్సిందే. అలాంటి సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు.ఇక ప్రేక్షకుల పల్స్ పట్టేసిన దర్శక నిర్మాతలు కూడా హీరో హీరోయిన్స్ తో ఎక్కువ రొమాంటిక్ సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే అది సినిమా వరకైతే ఓకే గానీ రియల్ లైఫ్ లో కూడా చేస్తే అది పెద్ద వివాదంగా మారుతుంది.అయితే తాజాగా ఇలాంటి వివాదాన్నే రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య మీడియా ముఖంగా బయట పెట్టింది..
తన ఫోన్లో ఉన్న ఒక ఫోటోని చూపిస్తూ రాజ్ తరుణ్ నిజ స్వరూపం చూడండి అంటూ ఒక ఫోటోని రివీల్ చేసింది. అయితే ఆ ఫోటోలో ఉన్న ఇమేజ్ రాజ్ తరుణ్ తన ఒడిలో ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకొని లిప్ కిస్ ఇస్తున్న ఫోటో.. అయితే ఈ ఫోటో మీడియా వాళ్లకు చూపిస్తూ ఇదిగో ఈ ఫోటో చూడండి.. ఇందులో ఎవరున్నారో మీకే అర్థమవుతుంది అని చెప్పింది. ఆ హీరోయిన్ ఎవరో తెలియడం లేదా..ఆమె ఎవరో కాదు ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది అంటూ లావణ్య చెప్పుకొచ్చింది.
దీంతో ఈ ఫోటో మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన చాలా మంది జనాలు నిజంగానే రాజ్ తరుణ్ అంత మంది హీరోయిన్లతో రిలేషన్ మెయింటైన్ చేశారా..లావణ్య చెప్పేదంతా నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇద్దరి లోకం ఒకటే హీరోయిన్ అంటే శాలిని పాండే కాబట్టి శాలిని పాండే తో కూడా రాజ్ తరుణ్ కి రిలేషన్ ఉంది అని భావిస్తున్నారు. ఇక లావణ్య గతంలో రాజ్ తరుణ్ లావర్ మూవీ హీరోయిన్ రిద్ధి కుమార్,బిగ్ బాస్ బ్యూటీ యాంకర్ అరియానా, ఇద్దరి లోకం ఒకటే హీరోయిన్ తో కూడా డేటింగ్ చేశారని ఆరోపించింది.ఇక ఇప్పుడు ఇది నిజమే అన్నట్లుగా లావణ్య బయటపెట్టిన సీక్రెట్ ఫోటో చూస్తే అర్థమవుతుంది.