బాలకృష్ణ 50 ఇయర్స్ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ రావట్లేదా..??

Suma Kallamadi

బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈనెల ఆగస్టు 29 తో 50 ఏళ్లు నిండుతాయి. ఈ 50 ఏళ్ల సినిమా జీవితం పూర్తయిన సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహించనున్నారు. బాలయ్య బాబు 50 ఇయర్స్ కెరీర్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకోబోతున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న జరగనుంది. టీడీపీ పార్టీ ఇప్పుడు బాగా బలపడుతున్న కారణంగా ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంతో మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

కానీ, ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తారు అన్నది ప్రధాన ప్రశ్న. సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ ఇన్విటేషన్ చక్కర్లు కొడుతోంది. ఈ ఆహ్వానంలో ఎవరి పేరును ప్రత్యేకంగా పేర్కొనలేదు. అయితే, ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని ప్రచారం జరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి రావచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి రావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

బాలకృష్ణకు అత్యంత దగ్గర బంధువులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఈ ఈవెంట్ కి వచ్చి సందడి చేస్తారా అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజులుగా నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనలేదు. అంతకుముందు కూడా నందమూరి ఫ్యామిలీ కోసం ఎన్టీఆర్ పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. అందువల్ల అతను వస్తారా రారా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారా అన్నది కూడా తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి వస్తే ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారుతుంది. మంచు మోహన్ బాబు, మా అధ్యక్షుడు విష్ణు మంచు కూడా ఈ ఈ ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉంది. ఇక మహేష్ బాబు ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ కూడా ఈవెంట్ కి వచ్చి సినిమా ఇండస్ట్రీకి విశేష సేవలు అందించిన బాలకృష్ణను అభినందించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: