అదేంటి పవన్ కళ్యాణ్ హీరోయిన్ అలా మారిపోయింది?

Suma Kallamadi
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా హీరోయిన్లు గురించి జనాలకు చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ ఒక హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, ఆమెలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా ఒక్కసారి సినిమా చేసిన హీరోయిన్ ఆయన మరలా రిపీట్ చెయ్యడు. కథ పరంగా కూడా వారికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ అంటించిన సినిమాలలోని హీరోయిన్లు ఇప్పటికీ జనాల మదిలో ఉండిపోతుంటారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ చేసిన సినిమా తొలిప్రేమ గురించి, అందులో నటించిన కీర్తి రెడ్డి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఇది పవర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇందులో నటించిన హీరోయిన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సంగతి కూడా తెలిసిందే.

మరీ ముఖ్యంగా ఇందులో ఎంట్రీ సీన్ అయితే ఇప్పటికీ ఎంతోమంది ఫెవరేట్‌ అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు అందం, మాటలు, అభినయానికి అప్పటి యూత్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ఇక ఈ మూవీ తర్వాత కీర్తి రెడ్డికి తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలతో నటించే అవకాశం లభించింది. కానీ తెలుగులో నటించకుండా ఆమె ఎంచక్కా బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ కూడా అమ్మడికి సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం జరిగింది. అలాగే ఆమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉన్నట్టు కనబడడం లేదు. కాగా తాజాగా, కీర్తి రెడ్డికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో అవి చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

దాంతో పవన్ కళ్యాణ్ అందాల తార ఏంటి ఇలా మారిపోయింది? అని అంటున్నారు. అలాగే కొందరు మాత్రం ఆమెని గుర్తు పట్టలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇమేనా పవన్ కల్యాణ్ సినిమాలో నటించిందని మరికొందరు అనుమానపడుతున్నారు. ఇక ఆ ఫోటోలను చూస్తే మీకు కూడా అలా అనిపించకమానదు. ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కీర్తి రెడ్డి మొదట అక్కినేని సుమంత్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత ఓ ఎన్‌ఆర్‌ఐని పెళ్లి చేసుకున్న ఆమె అమెరికాలోనే సెటిల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: