హైపర్ ఆదిపైన విరుచుకు పడిన రీతు... అంతా వాడే చేశాడు అంటూ?
అయితే ఆదికి మల్లె రీతుకి సినిమా ఆఫర్లు రాలేదు గాని, ఇప్పటికే పలు షోలలో రీతు తనదైన మార్క్ కామెడీని ప్రదర్శిస్తూ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె కమెడియన్ ఆది గురించి చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
హైపర్ ఆది మీ జీవితాన్ని ఏమన్నా ప్రభావితం చేశాడా? అన్న ప్రశ్నకి గాను ఆమె పలు విషయాలను చెప్పుకొచ్చింది. హైపర్ ఆది తన జీవితాన్ని ఫుల్ డ్యామేజ్ చేశాడంటూ సరదా సరదాగా మాట్లాడకు వచ్చింది. హైపర్ ఆది తన జీవితాన్ని డామేజ్ చేశాడని అందరూ అనుకుంటారు.. అలాంటిదేమీ జరగలేదని, ఆది వలనే తను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్ షో గురించి ఆమె మాట్లాడుతూ.. ఆది బయటికి వెళ్లిపోయిన తర్వాత తాను అక్కడ ఇమడ లేకపోయిన కారణంగానే బయటికి వచ్చినట్టు చెప్పుకొచ్చింది. అదేవిధంగా జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఆదరణ కారణంగానే తనని ఇతర షోలకు పిలుస్తున్నట్టు అభిప్రాయ పడింది. ఆది అంటే తనకు ఎంతో గౌరవం అని, ఈరోజు రెండు చేతుల సంపాదిస్తున్నాను అంటే దానికి కారణం అది మాత్రమే అని కూడా ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. కాబట్టి ఎవరు వారి బంధాన్ని గురించి తప్పుడు రాతలు రాయొద్దని కూడా సూచించింది.