ఫస్ట్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్.. వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్‌ రావడంతో..?

Suma Kallamadi
మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు వచ్చారు. రెండో తరం హీరోల్లో రామ్‌ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సక్సెస్ అయ్యారు. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ మాత్రం నాలుగైదు సినిమాలతోనే తట్టాబుట్టా సర్దుకున్నాడు. వైష్ణవ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్‌కు స్వయానా తమ్ముడు అవుతాడు. 'ఉప్పెన' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఎంట్రీ తోనే భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. రూ.100 కోట్ల క్లబ్ లోనూ చేరాడు.
ఈ ఒక్క సినిమాతో వైష్ణవ్ స్టార్ హీరో అయిపోయాడు. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్‌లు ఈ మెగా మేనల్లుడుతో పని చేయడానికి క్లూ కట్టాయి. తొలి మూవీతోనే ఇంత బూస్ట్ వచ్చింది కాబట్టి ఈ మెగా హీరోకు తిరుగులేదు అనుకున్నారు. రామ్ చరణ్‌కి పోటీ ఇవ్వబోతున్నాడని కూడా కామెంట్ చేశారు కానీ ఈ హీరో ఫస్ట్ మూవీలో మాత్రమే మెరిసాడు. ఆ తర్వాత కమర్షియల్ మూవీస్ తీయకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల వైపు వెళ్తూ చివరికి తెర మరుగయ్యాడు.
'ఉప్పెన' మూవీ చేశాక ఈ హీరో 'కొండపొలం' అనే అడ్వెంచర్ థ్రిల్లర్ చేశాడు. ఈ మూవీ స్టోరీ చాలా యూనిక్, యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది. కానీ కమర్షియల్ హిట్ కాలేదు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో కలిసి వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' అనే సినిమా చేశాడు కానీ, ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. అన్ని సినిమా కథలు మిక్స్ చేసి ఔట్ డేటెడ్ స్టోరీతో ఈ మూవీ చేశాడు కాబట్టి ఇది హిట్ కాలేదు. డిజాస్టర్ అయింది. వైష్ణవ్ తేజ్ గ్రాఫ్ అప్పటికే చాలా పడిపోయింది. ఇక ఎలాగైనా సక్సెస్ కొట్టాలని యాక్షన్ సినిమా 'ఆదికేశవ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాగా ఆడలేదు. దర్శకత్వం, రచన, యాక్షన్ సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే, క్యారెక్టరైజేషన్ అన్నీ వరస్ట్ గా ఉంటాయి. కథ చాలా ప్రిడిక్టబుల్ అందువల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫ్లాప్ అయింది. అంటే, వైష్ణవ్ తేజ్ వరుసగా మూడు సినిమాలు చేశాడు, కానీ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ హీరో సైలెంట్ అయిపోయాడు. ఏ కొత్త సినిమా కూడా  ప్రకటించలేదు. ఇంకో 4 నెలలు అయితే అతడు వన్ ఇయర్ గా ఖాళీగా ఉన్నట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: