సూపర్:షారుఖ్ ఖాన్ కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడుగా..!

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ తాజాగా ప్రత్యేకమైన ఒక గౌరవాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో గ్రావిన్ మ్యూజియంలో ఒక కొత్త బంగారు నాణ్యాన్ని విడుదల చేశారు. అయితే దీనిపైన షారుఖ్ ఖాన్ చిత్రం పేరు ఉండడం గమనార్హం. ఈ బంగారు నాణెం కలిగిన ఫోటోలను సైతం అభిమానులకు సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రముఖ ప్రసిద్ధి గ్రావిన్ మ్యూజియం.

చాలామంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. అలాగే షారుక్ ఖాన్ మైనపు విగ్రహ బొమ్మ కూడా ఇక్కడ కలదు. ఇప్పుడు తాజాగా బంగారు నాణెంతో కూడిన ఒక నాణ్యాన్ని విడుదల చేశారు.ఈ గౌరవం అందుకున్న మొట్టమొదటి తొలి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్ మాత్రమే పేరు సంపాదించారు. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడుగా కూడా పేరు సంపాదించారు. భారతీయ సినిమా ఇండస్ట్రీకి సుమారుగా మూడు దశాబ్దాలకు  పైగా హీరోగా సేవలందిస్తున్నారు షారుక్ ఖాన్ తన నటన ప్రతిభాతో ఎన్నో అవార్డులను కూడా అందుకోవడం జరిగింది.

2023 కంటే ముందు కొన్నేళ్లపాటు షారుఖ్ ఖాన్ నటించిన చిత్రాలు గోరంగా డిజాస్టర్ అయ్యాయి. అయితే జవాన్, పఠాన్, డంకీ  వంటి చిత్రాలు వరుసగా ఫ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంతో షారుక్ ఖాన్ క్రేజీని అమాంతం పెంచేశాయి. ఏకంగా ఇందులో రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టాయి. షారుఖ్ ఖాన్ తదుపరి సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. షారుక్ ఖాన్ పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ కాన్ కూడా శని పరిశ్రమలు బిజీగా ఉండబోతున్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు ఇందులో ఈయన కూతురు కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: