హీరోయిన్ ప్రణీత అంటే అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగు లో సిద్ధార్థ్ హీరో గా వచ్చిన బావా అనే మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ సినిమాల్లో కూడా హీరోయిన్గా రాణించింది. ఇక తెలుగు లో వచ్చిన మొదటి సినిమా లో ప్రణీత అందానికి, నటన కి ఫిదా అయినా దర్శక నిర్మాతలు ఆమెకు తెలుగు లో వరుస అవకాశాలు ఇచ్చారు. అలా అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం, హలో గురూ ప్రేమ కోసమే వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ హీరోయిన్ తెలుగులో నటించిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు సెకండ్ హీరోయిన్ గానే చేసింది. దాంతో కొద్ది రోజులకే తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
అవకాశాలు రాకపోవడంతో బెంగళూరు కు చెందిన బిజినెస్ మాన్ నితిన్ రాజుని 2021 లో పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత పెళ్లైన సంవత్సరానికే అంటే 2022 లోనే ప్రణీత కి పండంటి ఆడపిల్ల పుట్టింది. అయితే కూతురు పుట్టి సంవత్సరం అయిపోయాక మళ్ళీ తల్లి కాబోతున్నట్టు తెలుస్తుంది.అయితే గుడ్ న్యూస్ ని స్వయంగా ప్రణీత సుభాష్ తన అభిమానులతో సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది.ఇక తన సోషల్ మీడియా ఖాతాలో ప్రణీత ఏమని పోస్ట్ చేసింది అంటే..
జీన్స్ వేసుకున్న ఫోటోని షేర్ చేస్తూ రౌండ్ 3 ఇక ఇప్పటి నుండి నాకు ఈ ప్యాంట్స్ ఫిట్ అవ్వదేమో అంటూ క్యాప్షన్ పెట్టింది.ఇక ఈ ఫోటోలో ప్రణీత వేసుకున్న జీన్స్ లో నుండి బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తోంది.దీంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది జనాలు ప్రణీత సుభాష్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక కొంతమంది నెటిజన్స్ అయితే ప్రణీత కి ఫన్నీ కామెంట్లు పెడుతూ బిడ్డ పుట్టిన సంవత్సరానికే మరో బిడ్డనా.. ప్రణీత వెరీ ఫాస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.