విజయ్ కొత్త సినిమా నుండి లుక్ లీక్.. కావాలనే చేశారా..!?

Anilkumar
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇటీవల ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు  వచ్చిన విజయ్ ఈ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తదుపరి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD12 లో కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. అయితే విజయ్ దేవరకొండ యొక్క మాస్ లుక్ సూపర్ గా ఉంది. VD12 సెట్ నుండి పిక్ లీక్ అయ్యింది.

 అయితే ఈ లుక్ కి సోషల్ మీడియాలో సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. గుబురు గడ్డం, జుట్టును పూర్తిగా ట్రిమ్ చేసి ఉన్నాడు. కండలు తిరిగిన దేహంతో మాస్ అవతార్ లో ఆకట్టుకుంటున్నాడు.  ఇంకా చెప్పాలంటే ఇది వీరమాస్‌ లుక్‌. కళ్లజోడు పెట్టుకుని స్టయిల్‌గా ఉన్నాడు. మాస్‌, స్టయిల్‌ మేళవింపుతో ఉన్న ఈ పిక్ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది.  ఈ భారీ బడ్జెట్ స్పై థ్రిల్లర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్

 సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే తాజాగా దీనిపై టీమ్‌ స్పందించింది. షూటింగ్‌ డిటెయిల్స్ ని పేర్కొంది. సినిమాని థియేటర్లో బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకోసం నిర్విరామంగా వర్క్ చేస్తున్నట్టు తెలిపింది టీమ్‌. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్‌ జరుగుతుందని, ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని, మున్ముందు ఫస్ట్ లుక్‌, సినిమా అప్‌ డేట్‌ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నామని, అవన్నీ ప్రాపర్‌గా అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం లీక్ అయిన లుక్‌ గురించి చెబుతూ, తాము అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్‌ చేయండి, లీక్‌ పోస్టర్స్ షేర్‌ చేయకండి అని రిక్వెస్ట్ చేసింది టీమ్‌...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: