శ్రీదేవికి మెంటల్ గా పరిపక్వత లేదని తేల్చేసిన మురళి మోహన్?

Suma Kallamadi

అలనాటి అందాల నటి శ్రీదేవి గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆమె అందాన్ని చూసి అప్పటి కుర్రకారు ఎలా కుదేలయ్యారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ శ్రీదేవి పేరు వింటే ఓ జెనరేషన్ గుండెల్లో గుబులు పుడుతుంది. ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అడపా దడపా ఆమె అందం గురించి పొగుడుతూ.. ఇప్పటి కుర్రాళ్ళ మతులు కూడా పోగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆమె చేసిన సినిమాలు ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబడుతూ ఉంటాయి. అవును, ఆమె ఒక అతిలోక సుందరి అందంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొన్ని అనూహ్య కారణాల వలన ఆమె మనమధ్య లేదు గానీ, ఆమెగానీ బతికి ఉంటే ఇప్పటికీ ఆమె అందం ముందు నేటి తారలు దిగదుడుపే అని చెప్పుకోవచ్చు.
ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్ కి చిత్ర పరిశ్రమలో ఉన్న సత్సంబంధాలు గురించి అందరికీ తెలిసినదే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మా ప్రెసిడెంట్ గా సైతం మురళి మోహన్ తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించడం మనం చూసాం. అయితే ప్రస్తుతం సినిమాలకు ఆమడ దూరంలో ఉన్న మురళి మోహన్ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ తన మనసులోని మాటలు ప్రేక్షకులతో పంచుకుంటాడు. మురళి మోహన్ సినిమాల్లోకి మొదట అయిష్టంగా అడుగే పెట్టాడట. ఓ ఇంటర్వ్యూలో మురళి మోహన్ మాట్లాడుతూ.. హీరోయిన్ శ్రీదేవి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.
దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మురళీ మోహన్ నటించిన 'మా బంగారక్క' అనే చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ గా మొట్టమొదటి సరిగా తెరంగట్రం చేసిందట. అంతకు ముందు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా పాత్రలు చేసినప్పటికీ ఆ చిత్రంలో నటించే సమయానికి అయితే శ్రీదేవికి మెంటల్ గా అంత పరిపక్వత చెందలేదట. సెట్లో చిన్న పిల్లలాగే బిహేవ్ చేసేదని మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు. ఒక రోజు చైల్డ్ ఆర్టిస్ట్ లతో షూటింగ్ ఉండగా.. ప్రొడక్షన్ వాళ్ళు కొంత మంది పిల్లలని తీసుకు వచ్చారట. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ లలో ఒక అమ్మాయి చెల్లి కూడా వచ్చిందట. షూటింగ్ చూడడం కోసమే ఆమె వచ్చిందట. విషయం ఏమిటంటే... శ్రీదేవి ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ప్రొడక్షన్ వాళ్ళు తాము తీసుకువచ్చిన పిల్లల్ని కౌంట్ చేసుకుని చూడగా ఆ పిల్ల ఏమో లిస్ట్ లో లేదట. తీరా చూస్తే... ఆ పిల్ల అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ చెరువులోకి వెళ్లిందట.. ఆ విషయం తెలిసినా శ్రీదేవి చెప్పకపోవడంతో అందరూ ఆమెని తిట్టారట... ఇలా అప్పటి శ్రీదేవి అమాయకత్వాన్ని గురించి మురళి మోహన్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: