సౌత్ మూవీస్ పై నవాజుద్దిన్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!

murali krishna
గ్లామరస్ పరిశ్రమలో చేరాలనుకునే వేలమందికి స్పూర్తిదాయకం గా నిలుస్తూ, విజయం సాధించిన బాలీవుడ్ నటులు. అలాంటి వారి లో నటుడు నవావుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. అతను విమర్శకుల ప్రశంసలు మరియు ప్రశంసలను సాధించాడు, హిందీ సినిమాల్లో అత్యంత ఫలవంతమైన నటులలో ఒకడు అయ్యాడు. సౌత్ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరవు తున్నారు హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి. ఇప్పటికే వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.అలాగే మరిన్ని తెలుగు సినిమా ల్లో నటిస్తున్నాడు. తాజా గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన సౌత్ మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదని.. నటనపై ఇష్టంతోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపారు.రీసెంట్ గా ఓ కార్యక్రమం లో నవాజుద్దీన్ సౌత్ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సౌత్ చిత్రాల్లో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తుండడం వల్లే నటిస్తున్నాను అంటూ నవాజుద్దీన్ అన్నారు. కేవలం డబ్బు కోసమే ఆ పాత్రలు చేస్తున్నా. కానీ నేను నటిస్తున్న పాత్రల్లో నాకు ఎలాంటి ఎమోషన్స్ కనిపించడం లేదు. ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నా. బహుశా లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ కావచ్చు. ఎవరో ఒకరు వచ్చి సన్నివేశాన్ని వివరించాల్సి వచ్చింది. కొన్నిసార్లు నాకు ఏదో యాడ్ షూటింగ్ లో నటిస్తున్నట్లు ఉంది. నా పాత్రపై నాకు పట్టు దొరకడం లేదు అని అన్నారు. అందుకు నేను నిజంగా సిగ్గు పడుతున్నా అంటూ నవాజుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తీసుకున్న డబ్బుకి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్న.. ఆ విషయం లో నా మీద నాకే సిగ్గుగా వునని కుండా బద్దలుకొట్టాడు. ఇలా బాలీవుడ్ నటులతో ఉండే ఇబ్బందుల విషయంపై చాలాసార్లు తెలుగు ఇండస్ట్రీ సీనియర్ నటులు కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: