ప్రియదర్శి డార్లింగ్ సినిమాకి ఓటీటీ లో ఫుల్ క్రేజ్..!?

Anilkumar
బలగం సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రియదర్శి తాజాగా డార్లింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటిష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా అశ్విన్ రామ్ దర్శకత్వంలో వచ్చింది. అయితే ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డార్లింగ్ ఫన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగుతూ మంచిగా ఆకట్టుకుంది అని రివ్యూలు ఇస్తున్నారు మూవీ లవర్స్.  ఇకపోతే ప్రియదర్శి కామెడీ రోల్స్, హీరోగా, సైడ్ ఆర్టిస్ట్‌గా ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ వస్తున్నాడు.

 తనకంటూ ఓ గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక నభా నటేష్‌కు ఇది కమ్ బ్యాక్‌లా నిలుస్తుంది. చాలా గ్యాప్ తరువాత నభా నటేష్ తెరపైకి వచ్చింది. ఇది ఆమెకు ఓ పరీక్షలాంటిది. ఇక తెరపై ప్రియదర్శి కంటే నభా నటేష్‌కే ఎక్కువ స్కోప్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. నభా నటేష్‌లో చూపించడానికి ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ప్రేక్షకుడికి ఎక్కవు. నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్ అంతో ఇంతో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది వదిలేస్తే.. పార్టులు పార్టులుగా చూస్తే కొన్ని చోట్ల మంచి సీన్లే పడ్డట్టుగా అనిపిస్తుంది.  ఇదిలవుండగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

 ముందుగా వచ్చిన వార్తల ప్రకారం డార్లింగ్‌ పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. దక్షిణాది ప్రధాన భాషలన్నింటిలో సందడి చేయనుంది డార్లింగ్‌. ఈ మూవీ హిందీ వెర్షన్‌ శాటిలైట్‌, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆర్‌కేడీ స్టూడియోస్‌ దక్కించుకున్నట్టు బీటౌన్‌ సర్కిల్ సమాచారం. డార్లింగ్‌ శాటిలైట్‌ రైట్స్‌ను స్టార్ మా కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రంలో పెళ్లి చూపులు, కీడా కోలా ఫేం వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: