'గేమ్ చేంజర్' పైనే శంకర్ పూర్తి ఫోకస్..!?

Anilkumar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా  డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న  "గేమ్ చేంజర్" అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇందులో రామ్ ద్వి పాత్రలో కనిపించబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీయారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రాగా రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి చేసుకోగా ఇంకా రెండు వారాలకు సంబంధించిన మిగతా సీన్స్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ సినిమా విషయంలో శంకర్ ఏ రేంజ్ లో డెడికేషన్ చూపించారు అని మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పలు ఆసక్తికరమైన

 విషయాలను పంచుకున్నారు. తాజాగా ఆ మాటలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. అది ఏంటంటే.... నేను ఈ సినిమా సెట్స్ లోకి వెళ్ళింది చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఈ సినిమా డైలాగ్స్ విషయం కోసం శంకర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా చరణ్ కెరీర్ లోనే  మరో బిగ్గెస్ట్ మూవీగా నిలిచిపోతుంది అని అనుకుంటున్నాను. అంతేకాకుండా  సినిమా పూర్తి ప్యాకేజీ శంకర్ మార్కు లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని. శంకర్ గారికి తెలుగు వారంటే ఎంతో ఇష్టం మరియు గౌరవం అందుకే సినిమాలో ఏ చిన్న మిస్టేక్ లేకుండా అన్ని డైలాగ్స్ ను అద్భుతంగా రాబట్టారని ఆయన చెప్పుకొచ్చారు.

 ఆల్ ఓవర్ గా చెప్పాలంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా  డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న "గేమ్ చేంజర్"   సినిమా విషయంలో శంకర్ చాలా డెడికేషన్ చూపించారని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  ఇక‌, గేమ్ చేంజ‌ర్ సినిమాకు సంబంధించిన‌ పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ కూడా పూర్తయిన తర్వాత ఫైనల్ అవుట్‌‌‌‌పుట్ చూసి రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని ఆయ‌న అన్నారు డైరెక్టర్ శంకర్  . ఈ సంవ‌త్స‌రంలోనే గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన గేమ్‌ఛేంజ‌ర్ సినిమా విడుదల చేయడానికి ప్రయత్నిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: