పుష్ప 2 రిలీజ్ మళ్లీ వాయిదా పడనుందా..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే గతంలో వచ్చిన పుష్ప సినిమా సైతం 2021 లో డిసెంబర్ లోనే విడుదల అయింది. దీంతో పుష్ప సీక్వెల్ కూడా అదే సమయానికి విడుదల అవుతుండడంతో దీనిపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. కానీ చివరి వరకు సుకుమార్ హ్యాండ్ ఇస్తాడు అని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే

 పుష్ప టు కి సంబంధించిన షూటింగ్ అంతకంతకు లేట్ అవుతూనే వస్తుంది. అలా ఈ సినిమా విడుదల డిసెంబర్ లో కూడా కష్టమే అన్న వార్తలు వినబడుతున్నాయి. మరి అనుకున్న డేట్ కు పుష్ప విడుదల అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ కు బ్రేక్ పడింది. అల్లు అర్జున్ కూడా క్లీన్ షేవ్ చేసుకుని తన కుటుంబంతో కలిసి యూరప్‌కు విహారయాత్రకు వెళ్లాడు. మరోవైపు దర్శకుడు సుకుమార్ అమెరికా వెళ్లిపోయాడు. దీంతో షూటింగ్ మరింత ఆలస్యమవుతోందని తెలుస్తోంది. పుష్ప 2'లో , అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, డాలీ ధనంజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక పుష్ప 2 నుంచి ఇప్పటికే రెండు పాటలు, ఒక టీజర్ ను విడుదల చేశారు. వీటికి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక పుష్ప 2 పాటలు యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతున్నాయి. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే డిసెంబర్ 6నే పుష్ప 2 రిలీజ్ అవుతుందా? లేక వచ్చే ఏడాదికి వాయిదా పడనుందా? అన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పుష్ప 2 ను నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: