కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నబా నటేష్ , నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీల కంటే ముందు వీరిద్దరూ చాలా సినిమాలలో హీరోయిన్లుగా నటించారు. నబా నటేష్ "నన్ను దోచుకుందువటే" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ నటించింది. ఈ మూవీ కూడా అపజయాన్ని అందుకుంది. ఇక నిధి అగర్వాల్ విషయానికి వస్తే ఈ నటి సవ్యసాచి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇలా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమా కంటే ముందు వరుస అపజాయాలతో డీలా పడిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో ఈ బ్యూటీలు ఈ సినిమాలో నటించారు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో వీరిద్దరూ తమ నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో విరు తమ అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత వీరికి తెలుగులో అవకాశాలు భారీగా పెరిగాయి.
ఇకపోతే ప్రస్తుతం ఈస్మార్ట్ శంకర్ మూవీ కొనసాగింపుగా డబల్ ఈస్మార్ట్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాలో కావ్య ధాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా సినిమాలలో హీరోయిన్గా నటించగా అందులో ఏక్ మినీ కథ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల అయింది. ఈమెకు థియేటర్లలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా లేదు. మరి నబా నటేష్ , నిధి అగర్వాల్ మాదిరిగానే ఈమెకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో మంచి విజయం దక్కుతుందేమో చూడాలి.