రాత్రంతా ఆ పిల్ల అందులోనే ఉంది... శ్రీదేవి పై స్టార్ నటుడి కామెంట్స్..!
ఇక శ్రీదేవి ఎప్పుడూ చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తూ చిన్న పిల్లలను వెంట వేసుకుని తిరుగుతుందని ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు . అలాగే ఈ మూవీ షూటింగ్లో జరిగిన మరో ఘటన గురించి కూడా మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు . " ఓ రోజు చైల్డ్ ఆర్టిస్టులతో షూటింగ్ ఉండగా .. ప్రొడక్షన్ వారు పలువు రు పాలనటుల్ని తీసుకొచ్చారు . అయితే షూటింగ్ చూడాలని లిస్టులో లేని ఓ పిల్ల కూడా వచ్చింది . షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి మా పాప ఏదని అడగగా .. తాను మా మూవీలో లేదని చెప్పేసాం .
మరో అమ్మాయితో మా పాప వచ్చిందండి అంటూ చాలా కంగారు పడ్డారు . మిగతా పిల్లల్ని అడిగేసరికి చెరువులో షూటింగ్ అనంతరం కనిపించడం లేదని చెప్పారు . దీంతో అక్కడున్న వారంతా ఆ గ్రామ ప్రజలంతా వెతుకుతూ వెళ్లారు . రాత్రి వరకు వెతికిన ఆ పిల్ల దొరకలేదు . మార్నింగ్ చూసేసరికి చెరువులో కూరుకుపోయి కనిపించింది . దీంతో అందరం తీవ్ర విషాదానికి లోనయ్యాము " అంటూ మురళీమోహన్ కాస్త ఎమోషనల్ అయ్యారు . ప్రజెంట్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .