బెజవాడ బేబక్క వాచ్ ఖరీదు తెలుసా.. ఏకంగా 2 పాన్ ఇండియా చిత్రాలు తీయొచ్చట..!
అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో సీత , విష్ణు ప్రియ అంటే తనకు ఇష్టమని, వారిద్దరూ టాప్ ఫైవ్ కి వెళ్ళాలి అని, ఇద్దరిలో విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చింది బెజవాడ బేబక్క. ఇకపోతే హౌస్ లో ఉన్నది వారం రోజులే అయినా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. చాలా యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తనను తాను మరింత పాపులర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబక్క కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకొని, అందులో భాగంగానే ఆమె తన చేతికి ధరించిన గడియారం గురించి చెప్పుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె ధరించిన వాచ్ ఖరీదు అక్షరాలా రూ.78 కోట్లు. ఇక్కడితో ఆగిపోలేదు. ఈ వాచ్ ఈ భూమి మీద మరెక్కడ దొరకదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ వాచ్ తయారీ కోసం వాడే మెటల్ మార్స్ నుంచి తెప్పించామని , అందుకే దీని ఖరీదు రూ.78 కోట్లు అంటూ తెలిపింది. అంతే కాదు ఇందులో డైమండ్స్ కూడా పొదిగారని , ఇలా మార్స్ నుంచి ఆ మెటల్ తీసుకురావడం కోసం రాకెట్ తో సహా ఖర్చులన్నీ కలిపి రూ.78 కోట్లు విలువ చేస్తుందని ఆమె తెలిపింది.
అంతేకాదు అదే మెటల్ ఉపయోగించి హ్యాండ్ బ్యాగ్ కూడా తయారు చేయించుకున్నానని , దాని ఖరీదు రూ .180 కోట్లని చెప్పడంతో యాంకర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ.. ఇంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్, వాచ్ పెట్టుకొని మీరు ఎందుకు బిగ్బాస్ కి వెళ్లారు అంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే ఈమె దగ్గర ఉన్న వాచ్, హ్యాండ్ బ్యాగ్ ఖరీదుతో ఏకంగా రెండు పాన్ ఇండియా చిత్రాలు చేయవచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.