తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన ఒక పాత్ర చేయడంలో మాత్రం అసలు ఇంట్రెస్ట్ చూపలేదట. అసలు ఆ పాత్ర ఏది. ఎందుకు దానిపై ఇంట్రెస్ట్ చూపడం లేదు అనే వివరాలను తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ , సీనియర్ ఎన్టీఆర్ కి మనవడు అనే విషయం మనందరికీ తెలిసిందే. దానితో కొన్ని సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో అనేక మంది నిర్మాతలు , దర్శకులు ఆ పాత్ర కోసం ఆయనను సంప్రదించిన సమయంలో ఆయన అందుకు నో చెప్పేవాడట. అలా చెప్పడానికి ప్రధాన కారణం... సీనియర్ ఎన్టీఆర్ ఆయన గొప్ప నటుడు , అలాగే మహానుభావుడు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్ర చేసే అంత స్థాయి నాకు రాలేదు అని దానిని తిరస్కరించాడట.
ఇక ఆ పాత్ర కోసం ఎన్ని కోట్ల ఆఫర్ వచ్చినా కూడా దానిని చేయడానికి నిరాకరించాడట. అలా సీనియర్ ఎన్టీఆర్ పాత్ర చేసే స్థాయి తనకు లేదు అనే ఉద్దేశంతో ఎన్ని కోట్ల ఆఫర్ వచ్చినా కూడా దానిని ఎన్టీఆర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర , వార్ 2 సినిమాలలో హీరో గా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ ల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ మూవీ చేయడానికి రెడీగా ఉన్నాడు.