టాలీవుడ్ నట కిరీటి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ మాత్రమే. ఈయన కేవలం కామెడీ మాత్రమే కాకుండా విలనిజాన్ని కూడా పండించ గల హీరో. అయితే ప్రస్తుతం తాత పాత్రలు, తండ్రి పాత్రల్లో నటిస్తున్న ఈ హీరో నిజంగానే ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారా.. ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. రాజేంద్ర ప్రసాద్ బామ్మ పాత్రలకి కేరాఫ్ అడ్రస్ గా ఒకప్పుడు ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన రమా ప్రభ అల్లుడు. రమా ప్రభ తన తన సోదరి కూతురు విజయ చాముండేశ్వరి తో రాజేంద్ర ప్రసాద్ కి పెళ్లి చేయించింది.
ఇక ఈ జంట కు ఒక కూతురు కూడా ఉంది. ఇక ఆ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడానికి రాజేంద్ర ప్రసాద్ అసలు ఒప్పుకోలేదు. ఇక ఆ సమయం లో తనకసలు కూతురే లేదు అంటూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే రాజేంద్ర ప్రసాద్ ఆ హీరోయిన్ ని గాఢం గా ప్రేమించారట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి రజిని..
రాజేంద్ర ప్రసాద్ రజనీ కాంబినేషన్లో దాదాపు 14 సినిమాలు వచ్చాయి. అలా ఇన్ని సినిమాల్లో కలిసిన నటించే సరికి రాజేంద్ర ప్రసాద్ కి రజిని మీద విపరీతమైన ప్రేమ పెరిగి పోయిందట. దాంతో రజినీ ని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ అది కుదరలేదని, ప్రస్తుతం ఆమెకు పెళ్లి అయిపోయింది అలాంటి విషయాలు మాట్లాడకూడదు అని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో రాజేంద్ర ప్రసాద్ స్వయం గా బయట పెట్టారు. అలా రాజేంద్ర ప్రసాద్ రజిని ని గాఢంగా ప్రేమించారట.