చిలక పచ్చ బికినీతో ఇంటర్నెట్ని తగలబెట్టేస్తోన్న 50 ఏళ్ల బ్యూటీ?

Purushottham Vinay

బాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్ తో క్రేజ్ సంపాదించిన మలైకా అరోరా గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 50 ఏళ్ళు దాటిన ఈ ఐటమ్ బ్యూటీ ఇన్ స్టాకి ఎక్కిందంటే తనదైన మార్క్ తప్పనిసరి. ఈ సొగసరి ఎలాంటి దుస్తుల్లోనైనా అగ్గిరాజేసే అందాలతో ఇంటర్నెట్ని తగలబెట్టేసిద్ది. 50 ఏళ్ళు దాటి వయసు ముదురుతోన్న కూడా నవ నాయికలా ఇప్పటికీ అదే అందాన్ని మైంటైన్ చేస్తూ తన క్రేజ్ తో నెట్టింట సంచలనం అవుతుంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి బీచ్ బికినీలో చెలరేగింది. నియోన్ గ్రీన్ బీచ్ దుస్తుల్లో అంటే చిలక పచ్చ బికినీ వేసి ఈ అమ్మడు  సెగలు పుట్టిస్తుంది.ఈ ఓల్డ్ బ్యూటీ క్లోజప్ లో రెండు సెల్పీలు పోస్ట్ చేసి సోషల్ మీడియాని హీటెక్కించే పని పెట్టుకుంది. ఇక ఓ పిక్ లో వొంగుని స్పూన్ తో తింటూ ఫోజులివ్వగా..మరో పిక్ లో గ్లామర్ డోస్ ని క్లోజప్ లో రివీల్ చేసింది మలైక . 

ఇందులో ఈమె ఎండ తీవ్రతను తట్టుకునేలా తన కళ్లకు గ్లాసెస్ ధరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. అయితే అమ్మడిలా సోలోగా కనిపించడం మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ప్రియుడు అర్జున్ కపూర్ ఎక్కడ? అంటూ కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంబానీ ఇంట పెళ్లిలో అర్జున్ కపూర్  మెరిసిన సంగతి తెలిసిందే. కానీ ఈ మూడు రోజుల వేడుకలో ఎక్కడా కూడా మలైకా కనిపించలేదు. చూస్తుంటే అంబానీ ఇంట పెళ్లికి ఈమెకు ఆహ్వానం అందలేదేమో. అందుకే ఇలా మలైకా వెకేషన్ ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక మలైకా-అర్జున్ మధ్య దూరం పెరిగిందని కొన్ని రోజుల నుంచి మీడియాలో కథనాలు వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. కానీ అందులో వాస్తవం ఎంత? అన్నది మాత్రం క్లారిటీ లేదు.అలాగే మలైకా అరోరాకి బాలీవుడ్ లో అవకాశాలు కూడా బాగా తగ్గాయి. మునుపటిలా ఆమెకు ఛాన్సులు రావడం లేదు. వయోభారం సహా చాలా కారణాలు అమ్మడి కెరీర్ పై పడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అర్జున్ కపూర్ తో డేటింగ్ మొదలైన నాటి నుంచి వెండి తెరపై మలైక కనిపించింది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: