ఏకంగా అన్ని మూవీలను వెనక్కి నెట్టేసిన కల్కి.. 17వ రోజు ఆ రేర్ రికార్డ్..!

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ ట్రాక్ రావడంతో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇకపోతే ఈ మూవీ 17 వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. మరి 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలలో కల్కి మూవీ ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.71 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.19 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 2 వ స్థానంలో నిలిచింది.
తేజ సజ్జ హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.93 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి సినిమా విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.85 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరో గా దిశా పటాని హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా విడుదల అయిన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.72 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది. ఇలా కల్కి సినిమా విడుదల అయిన 17 వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: