అనంత్ అంబానీ పెళ్లిలో రజనీకాంత్ డాన్స్ వీడియో వైరల్..!

Divya
గత కొన్ని నెలల నుంచి అనంత్ అంబానీ పెళ్లి వేడుకల గురించి ముంబైలో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా వీరి వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు ,సౌత్ హాలీవుడ్ నుంచి కూడా ఎంతోమంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. సినీ క్రీడా వ్యాపార రాజకీయాల నుంచి కూడా చాలామంది హాజరు కావడం జరిగింది. దీంతో ముంబై మొత్తం ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీలతో, రాజకీయ నాయకులతో కలకల్లాడింది. అంతేకాకుండా ఈ వేడుకలలో చాలామంది నటీనటులు అందరూ కూడా డాన్సులు చేస్తూ ఫోటోలు దిగుతూ అభిమానులను ఆశ్చర్యపరిచారు.

సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా అంబానీ వేడుకలలో డాన్స్ చేయడం సర్వసాధారణము.. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి వారు ఈ వయసులో కూడా అది అంబానీ వేడుకలో ఇలా డాన్స్ వేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు రజనీకాంత్ తన భార్య లత తో పాటు కూతురు ఐశ్వర్య, మనవడితో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. అందరూ డాన్స్ చేస్తూ ఉంటే రజినీకాంత్ కూడా అనంత్ అంబానీ, అనిల్ కపూర్ ,రన్వీర్ సింగ్ తో పాటు పలువురుతో డాన్స్ చేసినట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

చిన్న చిన్న స్టెప్పులతో రజనీకాంత్ బాగానే డాన్స్ వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రజినీకాంత్ అభిమానులు ఈ వీడియోని తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలు చూసిన పలువురు నెటిజన్ సైతం ఈ వయసులో కూడా రజనీకాంత్ ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే చివరిగా లాల్ సలాం అనే చిత్రంలో నటించిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది.అలాగే జైలర్ సీక్వెల్, కూలి  అనే మరొక సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దసరాకి ఒక సినిమాని విడుదల చేసే విధంగా రజినీకాంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: