ఆ సినిమాలో హీరోయిన్ పేరే.. తారక్ భార్య ముద్దు పేరట తెలుసా?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి అన్ని విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఏకంగా పర్సనల్ విషయాల గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  అయితే అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటావ్. ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది క్యూట్ జోడీగా కొనసాగుతున్నారు తారక్, లక్ష్మీ ప్రణతి జోడి.

 వీరిద్దరూ ఎక్కడ కనిపించినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఫ్యామిలీనే ప్రపంచంగా బ్రతికే ఈమె భర్త పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తుంది. ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా.  షూటింగ్ కి వెళ్ళగలుగుతున్నాడు అంటే దానికి కారణం భార్య లక్ష్మీ ప్రణతినే అని చెప్పాలి. అందుకే తనకు తన భార్య అంటే ఎంతో ఇష్టమంటు ఎన్నో సందర్భాల్లో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అయితే సాధారణంగా భర్తలు భార్యలను ఏదో ఒక ముద్దు పేరుతో పిలుచుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందరికీ తెలిసిన స్టార్ హీరోలు తమ భార్యలను ఎలాంటి ముద్దు పేరుతో పిలుచుకుంటారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అందరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

 అయితే తారక్ తన భార్య లక్ష్మీ ప్రణతిని తన సినిమాలోని హీరోయిన్ పేరుతోనే పిలుస్తూ ఉంటాడట. ఇందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది. ఎన్టీఆర్ హీరోగా సమంత, శృతిహాసన్ హీరోయిన్ లుగా నటించిన రామయ్య వస్తావయ్య సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు. అయితే ఈ మూవీలో శృతిహాసన్ ముద్దు పేరు అమ్ములు  అయితే తారక్ తన సినిమాలో హీరోయిన్ ముద్దు పేరుతోనే భార్య లక్ష్మీ ప్రణతిని కూడా పిలుస్తూ ఉంటాడట  అయితే ఇలా లక్ష్మీ ప్రణతిని అమ్ములు అని పిలవడం ఈ మూవీ రాకముందు నుంచే చేస్తున్నాడ లేక మూవీ వచ్చాక మొదలుపెట్టాడ అన్న విషయం మాత్రం తెలియదు. అయితే తారక్ అమ్ములు అని పిలిస్తే లక్ష్మీ ప్రణతి కూడా ఎంతగానో మురిసిపోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: