భారతీయుడు 2 ఎండింగ్ లో ఊహించని సర్ప్రైజ్.. ప్లాన్ ఏంటంటే..!?

Anilkumar
దాదాపుగా 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా అంతా తేలికగా ఎవరు మర్చిపోలేరు. ఇప్పటికీ టీవీల్లో భారతీయుడు సినిమా వస్తే అలా అతుక్కుపోతూ ఉంటారు. అయితే ఆ సినిమాకి సీక్వల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమలహాసన్ ప్రధాని పాత్రలో వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా కనిపించబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమా మొత్తం లంచగొండితనం ఎలా జరుగుతుంది.. దాన్ని ఎలా నిర్మూలించాలి అన్న

 దానిపైనే కొనసాగుతుంది. ఇక  శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమలహాసన్ ప్రధాని పాత్రలో వస్తున్న ఈ సినిమా  నటిస్తున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదలై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటే జులై 12న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే..కేరళలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శంకర్‌ భారతీయుడు ఫ్యాన్స్ కు బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. 'ఇండియన్ 2 సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ చూపించబోతున్నట్లు ట్టాక్.మరో ఆరు నెలలలో రిలీజ్ కాబోతున్న ఇండియన్ 3

 ట్రైలర్ ఇప్పుడే చూపిస్తున్నాడంటే..మూవీ లవర్స్‌కు ఊపిరాడకుండా చేయాలని శంకర్ సార్ గట్టిగానే ఫిక్సయినట్టు ఉంది. ఇప్పటికే, ఇండియన్ 3 షూటింగ్ 70% కంప్లీట్ అవ్వగా..విఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తి కావొస్తున్నట్టు సమాచారం.ఈ సినిమా మరో ఆరు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ రేట్లు కూడా పెంచేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: