కన్ఫ్యూజన్లో చిరు.. ఎంతోమంది కథలు వింటున్న అందరికీ నో సిగ్నల్..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి స్టోరీ పక్కగా ఉండి కచ్చితంగా సినిమా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం కలిగితేనే ఆ సినిమాకు ఓకే చెప్తాడు. ఒక వేళ సినిమా కథలో ఏమైనా లోపాలు ఉన్నా వాటిని పర్ఫెక్ట్ గా సెట్ చేస్తే తప్ప సినిమాకి ఓకే చెప్పడు. దానితోనే చిరు సినిమా ఓకే చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాడు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ అయిన రోజే చిరంజీవి , కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది.

కాకపోతే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా స్టార్ట్ కాలేదు. ఇక ఆ తర్వాత నుండి చిరు "విశ్వంభర" మూవీ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు ... ఈ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అని అనేక మంది పేర్లు తెర పైకి వచ్చాయి కానీ ఇప్పటి వరకు చిరు మాత్రం ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం చిరు కి అనేక మంది దర్శకులు , కథ రచయితలు కథలను వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే వారు వినిపించిన కథలలో ఏదో చిన్న పాటి లోపాలు ఉండడంతో వాటిని చిరు పక్కన పెట్టేస్తున్నట్లు సమాచారం.

ఇక విశ్వంభర మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. జనవరి 10 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. దానితో చిరంజీవి మరో రెండు , మూడు నెలలలో కచ్చితంగా ఒక సినిమాను ఓకే చేయాలి అనే లక్ష్యంతో ఉన్నట్లు , అందులో భాగంగా అనేక కథలను వింటున్నట్లు తెలుస్తోంది. మరి చిరు కి నచ్చే కథ ఈ రెండు , మూడు నెలల్లో దొరుకుతుందో లేదో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: