పొలిమేర -3: ఫ్యాన్స్ గెట్ రెడీ.. వచ్చేస్తోందిగా..!
దీంతో డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ సక్సెస్ మీట్ లో.. ఈ సినిమా సీక్వెల్స్ చాలానే ఉన్నాయి కొనసాగింపు ఎంతవరకు ఉంటుందనే విషయం తాను చెప్పలేనని కూడా తెలిపారు.. తాజాగా పొలిమేర-3 అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. వంశీ నందిపాటి నిర్మాణంలో అనిల్ విశ్వనాథ్ విచిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. అలాగే సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్లతో పాటు గత సినిమాలలో ఉన్న నటీనటులే ఇందులో కూడా కనిపించబోతున్నారు. అలాగే సీనియర్ హీరో బబ్లు పృథ్వి కూడా ఇందులో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
పొలిమేర-3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా మొదలు పెట్టారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించి ఒక పోస్టర్ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేశారు. పొలిమేర, పొలిమేర-2 సినిమాలను ఎంత భయంకరంగా చూపించారా త్రీ అంతకుమించి ఉంటుందనే విధంగా అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి అభిమానులను ఆసక్తి కలిగించేలా ఉంటుందో లేదో చూడాలి మరి. పొలిమేర ఫ్రాంచేజీలో మరిన్ని సినిమాలు వస్తాయో చూడాలి మరి. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా పొలిమేర 1, పొలిమెర -2 చిత్రాలు చాలా ట్విస్టులతో కూడిన కథాంశం తోనే వచ్చాయి. ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా చేశారు. మరి త్రీ ఎలా ఉంటుందో చూడాలి.