బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అంటున్న మీనాక్షి చౌదరి.. ఒక్కరోజు గ్యాప్ లో ఏం చేసిందో చూడండి..!
1980 అండ్ 90 ల కాలంలో సాధారణ బ్యాంక్ ఆఫీసర్గా జీవితాన్ని మొదలుపెట్టిన భాస్కర్ కోటీశ్వరుడు గా ఎలా మారాడు అనే పాయింట్ తో ఈ మూవీ రూపొందుతుంది . ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు . పాన్ ఇండియన్ లెవెల్ లో తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో లక్కీ భాస్కర్ రిలీజ్ కాబోతుంది . ఇక లక్కీ భాస్కర్ మూవీ కోసం 1980 నాటి ముంబై నగరాన్ని తలపించే విధంగా హైదరాబాద్లో భారీ సెట్ వేశారు మేకర్స్ .
ఇక ఇదిలా ఉంటే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన మరో పాన్ ఇండియా మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం . లక్కీ భాస్కర్ కంటే రెండు రోజుల ముందు ఈ మూవీ రిలీజ్ కానుంది. విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న గోట్ మూవీ ని సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు . ఇక త్వరలోనే రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు . అలా ఒక్కరోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మీనాక్షి .