'వీడేమి హీరోరా బాబు?'.. మండిపడుతున్న ఫ్యాన్స్?

Purushottham Vinay

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి దాకా 100కు పైనే అతను సినిమాలు చేశాడు. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అజయ్ దేవగన్. అంతేగాక నాలుగు జాతీయ అవార్డులు కూడా అందుకున్నాడు.అయినా సరే.. తనకు నటన రాదు, ఫేస్‌లో ఓ ఎక్స్‌ప్రెషన్‌ అర్థం కాదు అని కొంతమంది నెటిజన్లు తనను బాగా విమర్శిస్తూనే ఉంటారు. సోషల్‌ మీడియా వచ్చాక ట్రోలింగ్‌ బారిన పడని సెలబ్రిటీలు ఎవరు లేరు. అలా ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ కూడా ఈ ట్రోలింగ్‌ బాధితుడే.తాజాగా ఓ నెటిజెన్ ఈ హీరోపై ఎక్స్‌ వేదికగా మండిపడ్డాడు. ఈ జెనరేషన్‌లో చెత్త హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అది అజయ్‌ దేవ్‌గణ్‌. అతను సరిగా ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా ఇవ్వలేడు.. అందుకే సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌లా స్టార్‌డమ్‌ ని అందుకోలేకపోయాడు. 


ఆఖరికి అక్షయ్‌ కుమార్‌ అంత పాపులారిటీ కూడా తెచ్చుకోలేకపోయాడు అంటూ అజయ్‌ నటించిన కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్‌ చూపిస్తూ ట్రోల్ చేశాడు.అయితే ఇది చూసిన అభిమానులు ఆ నెటిజెన్ పై మండిపడుతున్నారు. తమ హీరో గొప్పవాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అజయ్ చాలా బాగా నటిస్తాడు. సింగం, దృశ్యం, షైతాన్‌ సినిమాల్లో తన యాక్టింగ్‌ అయితే చాలా బాగుంటుంది, అంతేగాక నాలుగు సార్లు జాతీయ అవార్డు వచ్చిందంటేనే అర్థమవుతోంది తను యాక్టింగ్‌లో అందరికంటే గొప్పవాడని అంటూ అజయ్ దేవగన్ ఫ్యాన్స్ ఆ నెటిజెన్ పై మండిపడుతున్నారు.అజయ్‌ దేవ్‌గణ్‌ 1991 వ సంవత్సరంలో ఫూల్‌ ఔర్‌ కంటే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.కచ్చే ఢాగె, ద లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌, ఓంకార, గోల్‌మాల్‌, సింగమ్‌, మైదాన్‌.. ఇలా చాలా చిత్రాలతో అలరించాడు. జకం, ద లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌ సినిమాలకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా తానాజీ సినిమాకి (నటుడిగా, నిర్మాతగా) రెండు జాతీయ పురస్కారాలు గెలుచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: