ఎట్టకేలకు ఒక మంచి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్.. మొదటిసారి అలాంటి బ్యాడ్ డ్రాప్ లో..!?

Anilkumar
చాలామంది హీరోలు స్టార్ బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తూ ఉంటారు. ఇక అలా వచ్చినప్పటికీ కొంతమంది హీరోలు మాత్రం అస్సలు ఏమాత్రం గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. కానీ కొందరు మాత్రం స్టార్ హీరోలు అయ్యరు. అయితే స్టార్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే కొన్ని సినిమాలు ఎంత బాగున్నప్పటికీ డిజాస్టర్లుగా మారుతూ ఉంటాయి. కథ బాగున్న కూడా హీరోని చూసి ఆ సినిమాని ఫ్లాప్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. ఇక అందులో అక్కినేని అఖిల్ సినిమా లు

 ముందువరుసలో ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  అక్కినేని అఖిల్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఆ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్  మూటకట్టుకుంది. దాని తర్వాత మిస్టర్ మజ్ను హలో వంటి సినిమాలు చేసినప్పటికీ ఏమాత్రం సంపాదించుకోలేకపోయాడు. అలా ఆ సినిమాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేశాడు. అలా మొట్టమొదటిసారి ఈ సినిమా తో హిట్ సంపాదించాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే

  సినిమా చేశాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం ధీర అనే చిత్రాన్ని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు. ఇది లైన్లో ఉండగానే మరో సినిమాకు సైన్ చేసాడు. వినరో భాగ్యం విష్ణుకథ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిశోర్ చెప్పిన కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రానున్న ఈ చిత్రం చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రురల్ డ్రామా నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. మరి ఈ మూవీ ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి. ఇక ధీర విషయానికి వస్తే..యూవీ క్రియేషన్స్  సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి 'సాహో, రాధే శ్యామ్‌'కు అసోసియేట్‌గా పనిచేసిన అనిల్ కుమార్  దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: