ఈ టాలీవుడ్ హీరోకు ఒక్క హిట్టు లేదు... రు. 10 కోట్లు నీ మొఖానికి ఎందుకు సామి...!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్‌లో మామూలుగానే సక్సెస్ రేటు చాలా తక్కువ. స్టార్ హీరోలకు సైతం ఒక్కోసారి సినిమా హిట్టు అయిన బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ఇబ్బందులు తప్పలేదు. ఈ సినిమా చాలా సెంటర్లలో బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక నాని లాంటి హీరోలకు పేరుకు వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయని లెక్కలు చూపిస్తున్నా నాని సినిమాలు కూడా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కావటం లేదని అంటున్నారు. ఇందుకు హీరోల రెమ్యూనరేషన్లు గట్టిగా పెరిగిపోవడం.. దీనికి తోడు సినిమా నిర్మాణ వ్య‌యం పెరిగిపోవడం ప్రధాన కారణంగా చెప్పాలి.

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో టైర్‌2 హీరోలలో ఒక హీరో ఉన్నారు. మనోడు మిడిల్ రేంజ్ హీరో సినిమా కొట్టి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది. ఈ పదేళ‌లో అతడు నుంచి చెప్పుకోవటానికి ఒకటి అంటే ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. కానీ మనోడి రెమ్యూనరేషన్ మాత్రం రూ.10 కోట్లకు అస్సలు తగ్గను అంటున్నాడట. అసలు అతడి సినిమాల థియేట్రికల్ రైట్స్ అమ్మేందుకే నిర్మాతలు.. నానాతంటాలు పడుతున్నారు. కనీసం సినిమా ఫ్లాప్ అయితే రెండు కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి.

నాన్‌ థియేటర్ హక్కులు కూడా ఇటీవల కాలంలో అమ్ముడుపోవటం లేదు. ఎవరు కొనేందుకు ముందుకు రాని పరిస్థితి. ఎంత విచిత్రం అంటే.. ఇలాంటి హీరో మొత్తం పేమెంట్ ఇచ్చాక కానీ షూటింగ్‌కి రాను.. డబ్బింగ్ చెప్పను.. అని నిర్మాతలను బెదిరిస్తున్న వాతావరణం ఉంది. అసలు ఈ హీరోకు నిర్మాతలు ఛాన్సులు ఇవ్వటమే ఎక్కువ. అలాంటిది రూ.10 కోట్లకు అస్సలు తగ్గను పేమెంట్ మొత్తం ముందే కావాలని పట్టుప‌డుతున్నాడు అంటే.. ఈ హీరో ఎంతకు దిగజారిపోయాడో తెలుస్తోంది. అయినా నిర్మాతలదే మొత్తం తప్పు. ఇలాంటి హీరోలను ఎందుకు పెట్టుకుని సినిమాలు తీస్తారో ఎవరికి అర్థం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: