జగన్ మార్క్ షాక్... వలంటీర్లు... ఇక వైసీపీ ఉద్యోగులు... !
ప్రజలు అందరూ చాలా సుఖపడ్డారు. ప్రజలకు చాలా శ్రమ తప్పింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా వాలంటీర్లు వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయేవారు. ప్రజలు కూడా వలంటీర్లకే ఫోన్లు చేసేవారు. వారికే తమ సాధకబాధకాలు చెప్పుకునేవారు. అయితే వలంటీర్లు వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు డమ్మీలు అయ్యారు అన్నది నిజం. ఈ ఏడాది ఎన్నికలకు ముందు వలంటీర్ల వ్యవస్థ రాజకీయ దుమారం కావడంతో.. ఎన్నికల విధులకు దూరంగా ఉండిపోయింది. అయితే చంద్రబాబు మా పార్టీ అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి నాలుగు నెలలు అవుతున్నా.. వలంటీర్ల ప్రస్తావన తీసుకురావడం లేదు. మరోవైపు రాజీనామా చేసిన వారిని పక్కన పెట్టి మిగిలిన వారిని కొనసాగిస్తారో.. లేదో.. కూడా సందేహంగానే మారిపోయింది.
నాలుగు నెలలుగా వలంటీర్లకు గౌరవ వేతనం కూడా ఇవ్వటం లేదు. ఈ పరిణామాలపై తాజాగా స్పందించిన వైసీపీ అధినేత జగన్.. వలంటీర్లను చేసుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. మనం తీసుకువచ్చిన వ్యవస్థను మనమే కాపాడుకోవాలి.. ఎక్కడెక్కడ వలంటీర్లు ఉన్నారో అందర్నీ పిలవండి.. వారికి భరోసానివ్వండి.. అని జగన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని వారికి వచ్చే నెల నుంచి.. పార్టీ తరఫున ఐదువేల అందించే ప్రతిపాదిక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు ఈ వలంటీర్లు అందరూ వైసీపీ తరఫున పనిచేసేలా ఉంటుందట. ఈ విషయాన్ని సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి మీడియాకు చెప్పటం గమనార్హం. ఇదే జరిగితే చంద్రబాబుకు.. జగన్ మార్క్ షాక్ అని చెప్పాలి.
[10:59 am, 6/10/2024] V Subhash: