అందంగా లేమా..! ఫిజికల్ అప్పిరియన్స్ పై అపనమ్మకంతో నష్టపోతున్న వ్యక్తులు...!
తమ శరీరం పై తాము తక్కువ ప్రేమ లేదా తక్కువ విశ్వాసం కలిగి ఉండే వ్యక్తుల్లో ఎక్కువగా ఎలాంటి ప్రవర్తన కనిపిస్తుంది. ఒక విధమైన అభద్రతలో కనిపిస్తుంటారు. అలా ఫిజికల్ అప్పిరియన్స్ పై కాన్ఫిడెన్స్ లేని వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరి శరీరం, అందం, హావభావాలు, రంగు వేర్వేరుగా ఉంటాయి. అవి ఎలా ఉన్నా స్వికరించాలి. కానీ కొందరు తాము అందంగా లేవని, లేకపోతే ఫలానా వారిలాగా తమ స్కిన్ కలర్ లేదని బాధపడుతుంటారు. ఈ విధమైన ఫిజికల్ అప్పిరియన్స్ వారిలో అభద్రతా భావం కలిగిస్తుందని,
ప్రవర్తనలోనూ అది కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. పైగా భౌతిక రూపం బాగాలేదనే ఆలోచనతో తమ పై తాము విశ్వాసం లేదా నమ్మకం కోల్పోతారు. కొన్నిసార్లు ఈ విధమైన వ్యక్తులు తమ శరీరాన్ని తామే నలుగురిలో విమర్శించుకుంటారు. ఇతరుల విమర్శలకు బాధపడాల్సిన అవసరం లేకుండా ముందే అలర్ట్ అవుతారు. అయితే శరీరకంగా తాము బాగోలేమని ఈ విధమైన ఆలోచనను విడనాడాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం ఎలా ఉన్నా మీ ఆలోచనలను, ప్రవర్తనను బట్టి ఇతరులు గౌరవిస్తారని చెప్తున్నారు. తమ భౌతిక రూపానికి సంబంధించి స్వియ నిరాసలో కూరుకుపోయిన వ్యక్తుల్లో కనిపించే మరో ప్రవర్త ఏమిటంటే... వీళ్లెప్పుడు అద్దంలో చూసుకోవడానికి ఇబ్బంది పడతారు. బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా బిల్డింగ్ కు ఉన్న మిర్రర్ కావచ్చు.