ఆ హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చి మ‌రీ కెరీర్ నాశ‌నం చేసిన నాగార్జున ..!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ కింగ్ నాగార్జున కొన్ని సినిమాలలో ఆయన వయసు కంటే తక్కువ వయసు ఉన్న కుర్ర హీరోయిన్లతో నటించాడు. దీంతో కొందరు హీరోయిన్ల కెరీర్ కూడా దెబ్బతిన్నది  ..! సీనియర్ హీరోలు ఎప్పుడూ వయసుకు తగినట్టుగా హీరోయిన్ల ను చూజ్‌ చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. నయనతార చిరంజీవి - బాలయ్య - వెంకటేష్ - నాగార్జునలాంటి సీనియర్ హీరోలకు బాగా సూట్ అవుతుంది. అనుష్క - శ్రియా చ‌ర‌ణ్ - త్రిష లాంటి హీరోయిన్లు కూడా సీనియర్ హీరోల పక్కన బాగా సూటబుల్ అవుతారు. ఇక ముదురు ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సీనియర్ హీరోల పక్కన ఇప్పుడిప్పుడే నటిస్తోంది. ఇది ఇలా ఉంటే 15 సంవత్సరాల క్రితం నాగార్జున కుర్ర హీరోయిన్ల పక్కన ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపేవారు.

ఈ క్రమంలోనే నాగర్జున హీరోగా వచ్చిన సినిమా బాస్. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా నిర్మించిన ఈ సినిమాలో నయనతార తో పాటు పూనమ్ బ‌జ్వా హీరోయిన్ గా నటించింది. పూనం బ‌జ్వా ఇండస్ట్రీలోకి వచ్చి నప్పుడు చాలా చిన్న వయసు మొదటి సినిమాతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏకంగా నాగార్జున పక్కన బాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ దెబ్బకు ఆమె కెరీర్ తిరిగిపోతుందని అందరూ అనుకున్నారు. వాస్తవానికి అప్పట్లో ఆమె కుర్ర హీరోల‌ పక్కన నటించి ఉంటే ఆమె రేంజ్ వేరుగా ఉండేది. ఎప్పుడైతే నాగార్జున లాంటి సీనియర్ హీరో పక్కన ఆమె నటించిందో .. ఆ తర్వాత మీకు ఎవరు ఛాన్సులు ఇవ్వలేదు.. బాస్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెను అస్సలు పట్టించుకోలేదు. అప్పట్లో ఉదయ్ కిరణ్ - నితిన్ లాంటివాళ్ళు మంచి ఫామ్ లో ఉండేవారు .. ఆ హీరోల పక్కన ఆమెకు మంచి సినిమా పడి ఉంటే ఈపాటికి పూనం ఎక్కడో ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: