సీనియర్ యాక్టర్ దగ్గర కన్నడ క్లాసులు తీసుకుంటున్న మహేష్ .. ఇది మామూలు ప్లానింగ్ కాదు బాసు..!

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు  కన్నడ పై ఎక్కువ డిపెండ్ అవుతుంది .. కన్నడలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉండటం అక్కడ తెలుగు వారు కూడా ఎక్కువగా ఉండటంతో తెలుగు సినిమాలకు ఎక్కువ కలెక్షన్ వస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది .. అలాగే ఇప్పుడు వచ్చిన పుష్ప2 కూడా కలెక్షన్లు భాగ‌నే రాబట్టింది. ఇలా మన తెలుగు సినిమాలు బెంగళూరు , బళ్ళారి కొన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్ రాబడుతున్న విషయం మనం నిర్మాతలు గ్రహించారు. ఇక దీంతో మన స్టార్ హీరోలు కూడా అక్కడ సినిమాలు రిలీజ్ విషయంలో సీరియస్ గా ప్లానింగ్ తో దిగుతున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా  సినిమాల విషయంలో స్టార్ హీరోలు తమ డబ్బింగ్ తామే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోని అన్ని భాషలు నేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా కన్నడ భాష నేర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న మహేష్ సినిమా కోసం కన్నడ నేర్చుకుని తానే డబ్బింగ్ చెప్పాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టు టాక్. రెండు భాగ‌లుగా రానున్న ఈ సినిమాను ముందుగా వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టబోతున్నారు .. తర్వాత వీలును బట్టి రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు .. అయితే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కాస్త సీరియస్ గా ఉండటంతో సినిమా త్వరగానే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ..

 ఇదే క్రమంలో మహేష్ అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి కూడా కష్టాలు పడుతున్నాడు. తమిళం కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు .. అలాగే మలయాళం నేర్చుకోవడంలో టైం ప‌ట్టే అవకాశం ఉండడంతో తమిళం , కన్నడ అలాగే హిందీ కూడా డబ్బింగ్ తానే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన స్పెషల్ క్లాసులు కూడా ఒక సీనియర్ కన్న‌డ నటుడితో తీసుకుంటున్నారని తెలుస్తుంది. దేవరాజ్‌నే ఓ సీనియర్ నటుడు అటు కన్న‌డలోను ఫేమస్ ఇటు తెలుగులో కూడా ఆయన కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన దగ్గర మహేష్ బాబు కన్నడ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట .. రాజమౌళి కూడా ఈ విషయంలో ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: