దర్శకుడు శంకర్ సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమాలకు దాదాపుగా రెహమాన్ సంగీతం అందిస్తూ ఉంటాడు. ఇక ఈయన కెరియర్ మొదలు పెట్టిన దగ్గర నుండి చాలా సినిమాలకు రెహమాన్ సంగీతం అందించాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే శంకర్ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలకు రెహమాన్ సంగీతం అందించాడు. ఇకపోతే శంకర్ తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా ఇండియన్ 2 అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఇండియన్ మూవీ కి ఈ సినిమా కొనసాగింపుగా రూపొందింది.
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ మూవీ కి రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ సాంగ్స్ అద్భుతమైన విజయాన్ని అందించాయి. దానితో ఇండియన్ 2 అనౌన్స్ కాగానే దీనికి కూడా రెహమాన్ సంగీతం అందిస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఇండియన్ 2 మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో శంకర్ పలు టీవీ షో లలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఈయన ఇండియన్ 2 మూవీ కి రెహమాన్ ను ఎందుకు సంగీత దర్శకుడిగా తీసుకోలేదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా శంకర్ మాట్లాడుతూ ... రెహమాన్ బిజీ గా ఉండడం వల్లే ఆయనను ఇండియన్ 2 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోలేదు అని తెలియజేశాడు. ఇండియన్ 2 సినిమా పనులు ప్రారంభించినప్పుడు రెహమాన్ "రోబో 2.O" BGM వర్క్ చేస్తున్నాడు. పాటల త్వరగా కావాల్సి ఉండడంతో ఒత్తిడి చేయడం ఇష్టం లేక అనిరుద్ ను సంప్రదించాను. నాకు అతని మ్యూజిక్ అంటే ఇష్టం. అతను చాలా పాపులర్ కూడా. అందుకే తీసుకున్న అని శంకర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.