ఆ ఇద్దరి కోసం విశ్వక్ సేన్.. ఏమైనా బజ్ పెరిగేనా..?

Pulgam Srinivas
తెలుగులో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడు విశ్వక్ సేన్ కొన్ని విషయాలలో కఠినంగా ఉన్న చాలా విషయాల్లో చాలా సున్నితంగా ఉంటాడు. తన సినిమాలు ఏ విధంగా అయితే జనాల్లోకి తీసుకువెళ్లడానికి ప్రమోషన్ లను చేస్తూ ఉంటాడో వేరే వాళ్ళు అదే విధంగా ప్రమోషన్లు చేస్తూ ఉంటే వారికి సహాయం చేయడంలో కూడా ఈయన ముందు వరుసలో ఉంటాడు. అందులో భాగంగా చాలా సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ లకి కూడా ఈయన సపోర్ట్ చేశాడు. అలాగే తాజాగా ప్రియదర్శి హీరోగా నబా నటేష్ హీరోయిన్గా రూపొందిన డార్లింగ్ సినిమాకు సంబంధించి కూడా ఈయన తన వంతు సహాయం చేయబోతున్నాడు.
 

ఈ మూవీ ని జూలై 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ ను జూలై 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ట్రైలర్ కోసం ఓ పెద్ద లాంచింగ్ ఈవెంట్ ను కూడా మేకర్స్ నిర్వహించబోతున్నారు.

ఇకపోతే ఈ మూవీ యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జూలై 7 వ తేదీన హైదరాబాదులోని ఏ ఏ ఏ సినిమాస్ స్క్రీన్ 5 లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు , ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. చాలా రోజుల నుండి డార్లింగ్ మూవీ యూనిట్ ప్రమోషన్లను పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏర్పడడం లేదు. మరి విశ్వక్ సేన్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రావడం వల్ల , అలాగే ఒక వేళ ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటే కనుక ఈ మూవీ పై ప్రేక్షకులు అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: