కల్కి 2898 AD : ఆ ఏరియాలో సలార్ అవుట్.. కానీ ఇంకో మూవీ మిగిలే ఉంది..!

Pulgam Srinivas
ప్రభాస్ తాజాగా కల్కి 2898 అదే అనే సినిమాలో హీరోగా నటించాడు. జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ సినిమా నైజాం ఏరియాలో మాత్రం ఫుల్ జోష్ ను చూపిస్తుంది. నైజాం ఏరియాలో రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటి వరకు అత్యధిక షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టులో టాప్ పొజిషన్ లో ఉంది.

ఈ మూవీ నైజాం ఏరియాలో టోటల్ బాక్స్ ఆఫీస్ ముగిసే సరికి 111.85 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసింది. కాకపోతే ఆర్ ఆర్ ఆర్ సినిమా దగ్గరకు మాత్రం రాలేకపోయింది. ఈ సినిమా నైజాం ఏరియాలో బాక్స్ ఆఫీస్ రన్ క్లోజ్ అయ్యే సమయానికి 71.40 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే కల్కి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో నైజాం ఏరియాలో ఈ మూవీ కూడా ఫుల్ జోష్ ను చూపిస్తోంది.

అందులో భాగంగా కేవలం 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమా నైజాం ఏరియాలో 71.06 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 9 వ రోజుతో కల్కి మూవీ నైజాం ఏరియాలో సాలర్ లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో 80 కోట్ల షేర్ కలక్షన్ సాధించే దిశగా కల్కి ముందుకు సాగుతోంది. మరి ఈ మూవీ నైజాం ఏరియాలో టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: