ఎన్టీఆర్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్.. దెబ్బకి బిచానా ఎత్తేసిన ఆ స్టార్ నిర్మాత..!!
* ఎన్టీఆర్ కెరీర్ లో కోలుకోలేని దెబ్బ 'శక్తి' సినిమా
* నిర్మాతని నిండా ముంచిన మెహర్ రమేష్
* శక్తి దెబ్బకు సినిమా తీయాలంటేనే భయపడిన ఆ స్టార్ నిర్మాత..!!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… చిన్న వయసులోనే తిరుగులేని విజయాలు సాధించి భారీ స్టార్ డం అందుకున్నారు.. అయితే ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది.. వీరి కాంబోలో వచ్చిన మూడో మూవీ యమదొంగ.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని రాజమౌళి చాలా కొత్తగా చూపించారు.. అప్పటి వరకు ఎంతో బొద్దుగా వున్న ఎన్టీఆర్ సడన్ సన్నగా అయి అందరికి షాక్ ఇచ్చారు. కట్ చేస్తే యమదొంగ సినిమా సూపర్ హిట్ అయింది.. ఎన్టీఆర్ కి అప్పటి వరకు వచ్చిన ప్లాప్స్ అన్నిటిని మర్చిపోయేలా చేసింది..యమదొంగ తరువాత ఎన్టీఆర్ రేంజ్ కూడా మారిపోయింది.. కానీ కథల సెలక్షన్ లో మాత్రం ఎన్టీఆర్ తేలిపోయే వారు.. కథల ఎంపికలో ఎన్టీఆర్ చేయరాని మిస్టేక్ చేసారు..ఎన్టీఆర్ ను కొన్ని సినిమాలు హీరోగా నిలబెడితే కొన్ని సినిమాలు డేంజర్ లో పడేసాయి.. ఎన్టీఆర్ కి వున్న ఇమేజ్ కారణంగా కొన్ని సినిమాలు విడుదలకు ముందు ఏ స్థాయిలో భజ్ క్రియేట్ చేస్తాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చినప్పుడు షూటింగ్ దశలోనే అభిమానుల్లో అంచనాల స్థాయిని ఆకాశానికి తాకుతాయి. అయితే అలా అంచనాలు క్రియేట్ చేసి వచ్చిన సినిమాల్లో చాలావరకు బోల్తాకొట్టినవే ఎక్కువ. అందులో ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా కూడా ఉంది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు..గోవా బ్యూటీ ఇలియానా, మంజరి ఎన్టీఆర్ కు జోడీగా నటించారు.
ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ లో గ్రాండ్ గా నిర్మించగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. అంతకుముందు ఇదే కాంబినేషన్ లో వచ్చిన కంత్రి సినిమా కూడా యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇక శక్తి సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడు తప్పకుండా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేస్తుందని అంంతా అనుకున్నారు. అయితే కొందరు మాత్రం రిస్క్ చేస్తున్నావని నిర్మాత అశ్విని దత్ ని హెచ్చరించారు.అందులో రజినీకాంత్ కూడా ఉన్నారు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శక్తి సినిమా మిగిల్చిన నష్టాల పై అశ్వినిదత్ వివరణ కూడా ఇచ్చారు.మహాశక్తి పీఠాలకు అధిపతి అయిన అమ్మవారి విగ్రహంను సంరక్షించి యోధుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలో నటించాడు. అయితే ఎంతో నిష్ఠగా ఉండవలసిన అమ్మవారి కథలను ఈ పద్ధతిలో తెరకెక్కించడం మంచిది కాదని వైజయంతి నిర్మాత సి.అశ్వనీదత్ కు కొందరు సెలబ్రిటీలు వివరణ ఇచ్చారట.ఎక్కువగా రిస్క్ చేయొద్దని రజినీకాంత్ కూడా నిర్మాతకు ఫోన్ చేసి మరి చెప్పినట్లు సమాచారం.. అయితే అప్పటికే సినిమాని సెట్స్ పైకి తేవడం వలన ఆ సినిమాను తప్పక పూర్తి చేయాల్సి వచ్చిందని అశ్వినిదత్ తెలిపారు.సినిమాను 40 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించగా 25 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చిందని అశ్వినిదత్ తెలిపారు.. 50 ఏళ్ల వైజయంతి మూవీస్ ప్రస్థానంలో భారీగా నష్టాన్ని కలిగించిన సినిమా శక్తి అని అశ్వినీదత్ తెలియజేశారు. ఇక ఆ తర్వాత ఈ నిర్మాత ఏడేళ్ల వరకు వైజయంతి మూవీస్ లో తాను సినిమాలు నిర్మించలేదు. అంతలా ఎన్టీఆర్ సినిమా అశ్వినిదత్ ని మోసం చేసింది. అంతే కాదు ఎన్టీఆర్ కెరీర్ లోనే మచ్చగా మిగిలిన సినిమాగా శక్తి నిలిచింది.