హిందీలో కూడా రెచ్చిపోతున్న బాలయ్య... ఏకంగా ఆ రేర్ రికార్డ్..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి బాలకృష్ణ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భగకాంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... శ్రీ లీలా ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని సైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించారు.
 

మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రస్తుతం హిందీ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటుంది. కొన్ని రోజుల క్రితమే YT/ ADMOVIES యూట్యూబ్ ఛానల్ లో ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ కి యూట్యూబ్ లో 50 మిలియన్ ప్లస్ వ్యూస్ దక్కాయి. ఇక ఈ మూవీ కి మరిన్ని వ్యూస్ దక్కే అవకాశం చాలా వరకు ఉంది.

ఇలా భగవంత్ కేసరి మూవీ కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా హిందీ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను "NBK 109" అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ హీరో గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: