"ఇండియన్ 2" ను చిన్న అంచనా వేస్తున్న నటుడు.. అలాంటి నిర్ణయంతో కోలీవుడ్ కి షాక్..?

MADDIBOINA AJAY KUMAR
ఇండియన్ సినీ పరిశ్రమ నుండి అత్యంత భారీ అంచనాలతో విడుదలకు రెడీగా ఉన్న సినిమాలలో ఇండియన్ 2 మూవీ ఒకటి. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉండడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించడం , ఈ మూవీ కి దేశంలోనే గొప్ప గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండడం. ఈ రెండు కారణాలతో పాటు ఈ మూవీ ఇప్పటికే అద్భుతమైన విజయం సాధించిన ఇండియన్ అనే మూవీ కి కొనసాగింపుగా రూపొందడం.

ఇకపోతే ఇండియన్ 2 మూవీ ని జూలై 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ బృందం వారు ప్రచారాలను జోరుగా చేస్తున్నారు. ఇకపోతే ఇండియాలోనే అత్యంత క్రేజ్ కలిగిన సినిమా కావడంతో ఈ మూవీ విడుదల తేదీకి దగ్గర పెద్దగా ఏ సినిమా రిలీజ్ తేదీలను మేకర్స్ ప్రకటించలేదు. ఎందుకు అంటే ఒక వేళ ఇండియన్ 2 మూవీ కి కనక బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్లయితే ఆ సినిమా ముందు మామూలు టాక్ వచ్చిన సినిమా నిలబడడం కష్టం అనే ఉద్దేశంతో ఏ మూవీ మేకర్స్ కూడా ధైర్యం చేసి ఈ సినిమాకు దగ్గరలో విడుదల తేదీని ప్రకటించలేదు.

కానీ ఒక చిన్న మూవీ యూనిట్ మాత్రం ఏకంగా ఇండియన్ 2 సినిమా విడుదల తేదీనే తమ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యుగానికి ఒక్కడు ఫేమ్ ప్రముఖ నటుడు పార్థిబన్ ముఖ్య పాత్రలో నటించిన టీన్జ్ మూవీ ని ఇండియన్ 2 మూవీ కి పోటీగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఒక వేళ ఇండియన్ 2 మూవీ కి కనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా ముందు టీన్జ్ మూవీ నిలబడడం ఎంతో కష్టం అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: