ఆరో రోజు మరింత పడిపోయిన కల్కి కలెక్షన్స్.. నిరాశలో ప్రభాస్ అభిమానులు..!

lakhmi saranya
ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐదో రోజు నుంచి కాస్త కలెక్షన్స్ పడ్డాయి. ఆరో రోజు ఈ కలెక్షన్లు మరింత తగ్గిపోయాయి. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా బడ్జెట్ను మించి పోవడం విశేషం. ఈ సినిమా 6 రోజుల్లోనే తన బడ్జెట్ 6 కోట్లను గ్రాస్ కలెక్షన్ల రూపంలో దాటిపోయింది. ఇక ప్రభాస్, దీపికా పదుకుని, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ యాక్ట్రెస్ నటించిన ఈ సినిమా గత శుక్రవారం అలగా జూన్ 27వ తారీఖున రిలీజ్ అయింది.

తొలి రోజు 191.5 సాధించింది. ఇక ఆరో రోజు ఈ సినిమా ఇండియాలో 27.85 మాత్రమే రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక సోమవారం సగానికి సగం కలెక్షన్స్ తగ్గగా మంగళవారం అనగా నిన్న మరో 18.5% తగ్గాయి. దీంతో ఆరు రోజులు కలిపి ఇండియాలో 371 కోట్లకు. ఆరో రోజు తెలుగులో 11.2 కోట్లు హిందీలో 14 కోట్లు తమిళంలో 1.4 కోట్లు మలయాళం లో 1.2 కోట్లు కన్నడ లో 0.25 కోట్లు కలెక్షన్స్ చేసింది. ఒక్క తెలుగులోనే ఆరు రోజులు కలిపి సుమారు 200 కోట్ల వరకు రాబట్టడం విశేషం.

కల్కి మూవీ పై ఉన్న హైబ్స్తో తొలి రోజే ఇండియాలో 95.3 కోట్ల కలెక్షన్స్ తో ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఇక అనంతరం రెండో రోజు ఇవి ఏకంగా 59.3 కోట్లకు పడిపోయాయి. మూడో రోజు కాస్త పెరిగి 66.2 కోట్లకు రాగా నాలుగో రోజు 88.2 కోట్లకు చేరింది. ఇక ఐదో రోజు తొలి సోమవారం రూ. 34. 15 కోట్లు మాత్రమే రాబట్టింది. నిజానికి ఈ మూవీ ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 625 కోట్ల క్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: