బ్రేక్ ఇచ్చినా తగ్గని క్రేజ్.. సమంత హిట్ కాంబో రిపీట్..!?

Anilkumar
గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే సమంత ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. అలా ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత మళ్ళీ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ కావాలని చూస్తుంది. ఇక ఏడాది కాలం పాటు సమంత తన అనారోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే తాజాగా సమంత తను ఇదివరకు ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో పాల్గొంటుంది.

 ఇప్పటికే ఒక సినిమాను అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ విజయ్ తో సమంత నటించినబోతున్నట్లుగా   పలు వార్తలు వినబడుతున్నాయి.  గతంలో వీళ్ళిద్దరికి కాంబోలో సినిమాలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న 69వ సినిమాలో సమంత నటించినబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ది గ్రేటెస్ట్‌ ఆఫ్ ఆల్‌ టైమ్ గోట్‌ పూర్తి అయిన వెంటనే హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో విజయ్ మూవీ చేయబోతున్నాడు.

  విజయ్‌ రాజకీయ ప్రకటన చేసిన నేపథ్యంలో హెచ్ వినోద్‌ సినిమా చివరి సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే విజయ్ చివరి సినిమాలో నటించిన అరుదైన ఘనత సమంత దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.  సమంత ఏడాది బ్రేక్ తీసుకున్నా కూడా ఏమాత్రం జోరు తగ్గలేదు. ఆమె ఓకే అనాలే కానీ ఏకంగా ఆమె కిట్టీ లో అర డజను సినిమాలు నిండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆమె మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది.అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సామ్ సినిమాల్లో కొనసాగింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను ప్రాధాన్యత ఇస్తూ.. తన నటనకు ప్రశంసలు అందుకుంది సామ్. అయితే కారణాలేంటో తెలియదు కానీ.. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట ఈ ఏడాది విడాకులు తీసుకుని తమ అభిమానులకు షాకిచ్చారు. అయితే విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే కారణాలు ఈ జంట బయటపెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: