బాబు 4.0 : రేష‌న్ డీల‌ర్ల‌కు ఊపిరి పోస్తున్నారే...!

RAMAKRISHNA S.S.
- డీల‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి ఇంటింటికి రేష‌న్ ఇచ్చిన జ‌గ‌న్‌
- రేష‌న్ డీల‌ర్ల‌కే పంపిణీ ఇస్తోన్న బాబు... !
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో రేష‌న్ డీల‌ర్ల పాత్ర ఎంత చెప్పుకొన్నా త‌క్కువే. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా రేష‌న్ డీల ర్లు.. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌తో అనుబంధంగా ఉండి.. వినియోగ‌దారుల‌కు.. ముఖ్యంగా రేష‌న్ కార్డు దారుల కు.. నిత్యావ‌స‌రాల‌ను అందిస్తున్నారు. అయితే.. స‌హ‌జంగానే డీల‌ర్ల‌పై కొన్ని ఆరోప‌ణ‌లు వున్నాయి. తూ కం త‌క్కువ ఇస్తార‌ని.. వినియోగ‌దారులు తీసుకోక‌పోయినా.. తీసుకున్న‌ట్టుగా న‌మోదు చేస్తార‌ని ఆరోప‌ణ లు వున్నాయి. అందుకే విజిలెన్స్ వారు ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు చేస్తుంటారు.

ఇలాంటి ఆరోప‌ణ‌లు త‌గ్గించుకునేందుకు ప్ర‌తి ప్ర‌భుత్వం కూడా ప్రాధ‌మికంగానే చ‌ర్య‌లు తీసుకుంటు న్న ప‌రిస్థితి దేశ‌వ్యాప్తంగా ఉంది. ఎన్ని వ్య‌వ‌స్థ‌లు అందుబాటులోకి వ‌చ్చినా.. రేష‌న్ డీల‌ర్లను తీసేసి.. కొత్త విధానాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ త‌ప్ప ఏ రాష్ట్రం కూడా అమ‌లు చేయ‌లేదు. కానీ, ఏపీలో జ‌గ‌న్ మాత్రం 2019లో అధికారంలోకి వ‌స్తూ వ‌స్తూనే.. రేష‌న్ డీల‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి.. వాహ‌నాల‌ను తీసుకువ‌చ్చారు. ఇంటింటికీ.. పంపిణీ చేసేలా.. కార్యాచ‌ర‌ణ‌రూపొందించారు.

పోనీ.. ఇదేమ‌న్నా స‌క్సెస్ అయిందా ? అంటే.. ప్రాధ‌మికంగా.. చూసుకుంటే.. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల వ‌ర‌కు కొంత మేలు చేసినా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం.. ఇప్ప‌టికీ ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. నెల చివ‌రి వ‌ర‌కు కూడా.. రేష‌న్ వాహ‌నాలు అక్క‌డ‌కు చేరుకోలేక పోతున్నాయి. ఇక‌, కొండ ప్రాంత వాసులు.. కిందికి దిగి వ‌చ్చే గ‌తంలో మాదిరిగానే రేష‌న్ తీసుకుంటున్నారు. తండాలు, చెంచు గూడేలు, మాదిగ గూడేలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

అంటే.. ఒక ర‌కంగా వాహ‌నాల ప్ర‌యోగం.. ఆశించిన ప్ర‌యోజ‌నం క‌లిగించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ వీటిని కొన‌సాగించారు. మ‌రోవైపు.. అప్ప‌టి వ‌ర‌కు రేష‌న్ పంపిణీపైనే ఆధార‌ప‌డిన డీల‌ర్ల కుటుంబాలు రోడ్డున ప‌డ్డారు. వీరు త‌మ‌కు ఉపాధి చూపించాల‌ని కూడా మొత్తు కున్నారు. కానీ, జ‌గ‌న్ స‌ర్కారు ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రేష‌న్ డీల‌ర్ల‌కే తిరిగి స‌రుకుల పంపిణీని అప్ప‌గించేందుకు నిర్ణ‌యించింది. సెప్టెంబ‌రు నుంచి రేష‌న్ డీల‌ర్లు తిరిగి పుంజుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: