కూట‌మి ప్ర‌భుత్వంలో హాట్ టాపిక్‌గా మారిన ఆ నేత‌... !

RAMAKRISHNA S.S.
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యానికి.. ఆయ‌న‌కు ఇచ్చిన టికెట్ విష‌యానికి కూడా మూల కార‌ణ మైన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎన్‌వీఎస్ ఎన్ వ‌ర్మ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న‌కు త‌గిన గౌర‌వం ల‌భిస్తుందా?  లేదా? .. అనే చ‌ర్చ కూట‌మి పార్టీల నాయ‌కుల మ‌ధ్య హాట్ హాట్‌గా సాగుతోంది. వాస్త‌వానికి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వ‌ర్మ‌కు.. టికెట్ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆయ‌న ప‌వ‌న్ కోసం త్యాగం చేయాల్సి వ‌చ్చింది. ముందు త‌ట‌ప‌టాయించినా.. త‌ర్వాత చంద్ర‌బాబు హామీ మేర‌కు ఆయ‌న త‌ప్పుకొన్నారు.

అంతేకాదు.. ప‌వ‌న్ కోసం.. నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగి.. ఆయ‌న గెలుపున‌కు కార‌ణ‌మ‌య్యారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ జ్వ‌రం బారిన ప‌డినియోజ‌క‌వ‌ర్గానికి రాక‌పోయినా.. ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను వ‌ర్మే భుజాన మోశారు. ఇదేస‌మ‌యంలో ఎన్నిక‌ల రోజు కూడా.. ప‌వ‌న్ మంగ‌ళ‌గిరిలోనే ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి బూత్‌కు తిరిగి.. ఓటింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించ‌డంతోపాటు.. ఎలాంటి అక్ర‌మాలు జ‌ర‌గ‌కుండా చూసుకున్నా రు. ఇలా.. ప‌వ‌న్ గెలుపుకోసం.. వ‌ర్మ చాలానే క‌ష్ట‌ప‌డ్డారు.

మ‌రి ఈ నేప‌థ్యంలో వ‌ర్మ కు న్యాయం చేస్తారా?  ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీ మేర‌కు.. ఆయ‌న‌కు ఏమైనాప‌ద‌వులు ఇస్తారా?  లేక‌.. మ‌రికొన్నాళ్లు అలానే ఉంచుతారా? అనే చ‌ర్చ సాగుతుండ డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ప్ర‌స్తుతం రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒక‌టి వ‌ర్మ‌కు ద‌క్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి.. ఖాళీగా ఉన్న ఒక మంత్రి స్థానాన్ని కూడా అప్ప‌గిస్తార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది.

అయితే..ఖాళీ అయిన‌.. రెండు స్థానాల్లో ఒక‌టి టీడీపీ తీసుకుంది. రెండోది జ‌న‌సేన తీసుకుంది. కానీ, వ‌ర్మ‌కు మాత్రం ఛాన్స్ ఇవ్వ‌లేదు. పోనీ.. ఇప్ప‌ట్లో అయినా.. ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యేవి ఉన్నాయా ? అంటే.. లేవు. మ‌రి వ‌ర్మ ప‌రిస్థితి ఏంటి?  ఆయ‌న మ‌రికొన్నాళ్లు అలా మౌనంగానే ఉండిపోవాలా?  అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో వైసీపీలో మర్రి రాజ‌శేఖ‌ర్‌కు జ‌రిగిన‌ట్టే.. వ‌ర్మ‌కు కూడా జ‌రుగుతుందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: