ష‌ర్మిల చాణుక్యం... జ‌గ‌న్‌ను గింగ‌రాలు కొట్టిస్తోందే..?

RAMAKRISHNA S.S.
రాజ‌కీయాల్లో ఒక్క అడుగు వెన‌క్కి ప‌డితే.. ప్ర‌త్య‌ర్థులు వంద అడుగులు  ముందుకు వేసేస్తారు. ఈ విష యంలో ఎలాంటి సందేహం లేదు. మ‌ళ్లీ వెన‌క్కి ప‌డిన అడుగులను స‌రిచేసుకునేందుకు ప్ర‌య‌త్నించి నా.. స‌క్సెస్ కావ‌డానికి చాలానే స‌మయం ప‌డుతుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే.. జ‌గ‌న్ ఎదుర్కొంటు న్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక ల‌స‌మ‌యంలో ఆయ‌న సోద‌రి, పీసీసీ చీఫ్ ష‌ర్మిల దూకుడు తో జ‌గ‌న్ వెనుక‌బ‌డ్డారు. ఆమె ఇచ్చిన ప్ర‌శ్న‌ల‌కు.. ఆయ‌న స‌రైన కౌంట‌ర్ ఇవ్వ‌లేక పోయారు.

పైగా.. వ్య‌క్తిగ‌తంగా చీర‌ల గురించి ప్ర‌స్తావించారు. అదేస‌మ‌యంలో ఆమె టీడీపీతో కుమ్మ‌క్క‌య్యార‌ని చెప్పారు. కానీ, ప్ర‌జ‌లు మాత్రం విశ్వ‌శించ‌లేదు. దీంతో ష‌ర్మిల దూకుడుకు సరైన విధంగా జ‌గ‌న్ బ్రేక్ పెట్టలేక పోయార‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా వైఎస్ వార‌స‌త్వం గురించిన చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా..జ‌గ‌న్ బ‌ల‌మైన ఎదురు దాడి చేయలేక పోయారు. దీంతో వైఎస్ వార‌సులు ఎవ‌రు?  ష‌ర్మిలా?  జ‌గ‌నా? అనే చ‌ర్చ అలానే ఉండిపోయింది.

ఎన్నిక‌ల త‌ర్వాత‌.. జ‌గ‌న్ సైలెంట్ అయిపోయారు. ఎవ‌రికీ క‌నిపించ‌కుండా.. రెస్ట్ తీసుకుంటున్నారు. పులివెందుల‌, బెంగ‌ళూరుల్లో ఉన్నారు. తాజాగా తాడేప‌ల్లికి వ‌చ్చారు. కానీ, ఈలోగా.. ష‌ర్మిల‌.. రెండు కీల‌క విష‌యాల‌పై స్పందించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రాన్ని నిల‌దీయాలంటూ.. ఆమె చంద్ర‌బాబు ను ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా విష‌యంలో బిహార్ అడుగులు వేగంగా ప‌డుతు న్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో ఏపీ కూడా స్పందించాల‌ని ఆమె సూచించారు.

రెండోది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్ర‌హాల‌ను కూల‌దోస్తున్నార‌ని.. ఇది అప్ర‌జాస్వామిక‌మ‌ని ష‌ర్మిల గ‌ళం వినిపించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం గ‌వ‌ర్న‌ర్‌కు ఓ లేఖ రాసి స‌రిపుచ్చారు. ఇదిలావుంటే.. జూలై 8న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 75వ పుట్టిన రోజునుపుర‌స్క‌రించుకుని ష‌ర్మిల దూకుడుగా ముందుకు సాగుతున్నారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌నున్న భారీ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలంటూ.. ఆమె జాతీయ‌స్థాయి నాయ‌కుల‌ను ఆహ్వానిస్తున్నారు.

మ‌రోవైపు..జ‌గ‌న్ మాత్రం తండ్రి జ‌యంతిని సాదాసీదాగా నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఫ‌లితంగా ష‌ర్మిల ముందు.. జ‌గ‌న్ తేలిపోతున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నారు. ఇదే నిజ‌మైతే.. వైసీపీ సీనియ‌ర్లు కూడా పార్టీ జంప్ అవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: