కల్కి 2898 AD: ఆ రెండు రాష్ట్రాల్లో వసూళ్లు మహా దారుణం?

Purushottham Vinay
కల్కి 2898 AD: ఆ రెండు రాష్ట్రాల్లో వసూళ్లు మహా దారుణం? 

'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టేసింది. ఇంకా రాబడుతుంది కూడా. ఇప్పటిదాకా కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏకంగా రూ. 555 కోట్ల వసూళ్లు వచ్చేసాయి. కల్కి చిత్ర కథను, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం కూడా ఎంతగానో పొగుడుతుంది. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కితో పేరు తెచ్చుకున్నాడు.భవిష్యత్తులో జరగబోయే ఒక ఊహాజనిత కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. యూఎస్ లో కల్కి సినిమా వసూళ్లు ఏకంగా $11 మిలియన్ వసూళ్లని దాటేసాయి. 


 హిందీలో కూడా ఇప్పటికీ కల్కి సినిమా వసూళ్లు రూ. 115 కోట్లకి పైగా నెట్ వసూళ్లని దాటేశాయి.ఈ వారం కూడా నిలకడగా వసూళ్లు రాబడితే ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంటుంది. కానీ అన్ని చోట్ల అదరగోడుతున్నా కూడా రెండు రాష్ట్రాల్లో మాత్రం కల్కి వసూళ్లు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి.ఈ సినిమా కేరళ బాక్స్ఆఫీస్ వద్ద కేవలం 12.6 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక తమిళనాడు సంగతి తెలిసిందే. అక్కడ భాషా బేధం ఎక్కువ కాబట్టి కల్కికి చాలా తక్కువ వసూళ్లు వస్తున్నాయి. అక్కడ ఇప్పటిదాకా కల్కికి అత్యంత దారుణంగా 10 కోట్లు మాత్రమే వచ్చాయట. ఇక ఈ చిత్రంలో దిశా పటాని, పశుపతి, మరియు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: