కల్కి: టికెట్ రేట్లు పెంచి దండుకుంటున్న నిర్మాత ఏమంటున్నాడంటే?

Purushottham Vinay

'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టేసింది. ఇంకా రాబడుతుంది కూడా. ఇప్పటిదాకా కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏకంగా రూ. 555 కోట్ల వసూళ్లు వచ్చేసాయి. కల్కి చిత్ర కథను, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం కూడా ఎంతగానో పొగుడుతుంది. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కితో పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. ఇక ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా కూడా వారు ఇప్పుడు స్టార్స్ గా మారారు. ఇక పోతే ఈ సినిమాని సీనియర్ నిర్మాత అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ 600 కోట్లకి ఇప్పుడు బ్లాక్ బస్టర్ రూపంలో న్యాయం జరుగుతుంది. 


టికెట్ రేట్లు కూడా పెంచారు. దాని గురించి అశ్విని దత్ ఈ విధంగా మాట్లాడారు.ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు ఇవ్వడం మంచి నిర్ణయమని చెప్పిన అశ్వనీదత్‌.. ఈ పెంపు వల్ల బ్లాక్‌ టికెటింగ్‌ తగ్గుతుందని తద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు మంచే జరుగుతుంది అని చెప్పారు. అయితే కొంతమంది మాత్రం 'టికెట్‌ రేట్లు పెంచి నిర్మాతలు దండుకుంటున్నారు' అని ఆరోపణలు చేస్తున్నారని అశ్వనీదత్‌ అన్నారు. అలాంటి ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. వారం తర్వాత టికెట్‌ ధరలు సాధారణమైపోతాయని కూడా అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అశ్వనీదత్‌ చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు కాబట్టి.. రాష్ట్రంతో పాటు, సినీ పరిశ్రమ కూడా బాగుపడుతుంది అని చెప్పారు. మరి పదవులు ఏమన్నా ఆశిస్తున్నారా అంటే.. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: