కల్కి పార్ట్ 2 లో దుల్కర్ ఎలివేషన్లకి థియేటర్లు దద్దరిల్లడం పక్కా?

Purushottham Vinay
 ప్రభాస్ హీరోగా నటించిన తాజా మూవీ కల్కి 2898 AD.గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు 191 కోట్లకి పైగా ఈ సినిమా వసూళ్ళని సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు కూడా బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇంకా కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను మహానటి సినిమాతో సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక అటు విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ సినిమా రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. 


కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు క్యారెక్టర్స్ను ఆయన మలిచిన తీరుకు వావ్ అంటున్నారు. అయితే 'కల్కి'లో  మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేశారు. అయితే సినిమా చూసేటప్పుడు దుల్కర్ది కేవలం సాధారణ పాత్రేనని అంతా అనుకున్నారు. భైరవ (ప్రభాస్)ను పెంచే తండ్రిగా దుల్కర్ కనిపించారు. సినిమాలో కూడా ఈ రోల్ కొద్ది సేపే ఉంటుంది.పైగా ఆ పాత్రకు పెద్దగా ఎలివేషన్స్ ఉండవు.చాలా సింపుల్గా చూయించేశాడు నాగ్ అశ్విన్. అయితే పార్ట్ 2 లో ఆయన పరశురాముడి క్యారెక్టర్ చేస్తున్నాడట.'కల్కి' మూవీలో ప్రభాస్కు యుద్ధవిద్యలు, ఎలా బతకాలి అనేవి నేర్పిస్తూ కనిపించారు దుల్కర్ సల్మాన్. సినిమా ఆఖర్లో ప్రభాస్ క్యారెక్టర్ కర్ణుడిగా రివీల్ చేశాడు డైరెక్టర్ నాగీ. అయితే దుల్కర్ పాత్రను మాత్రం సింపుల్ గా చూపించాడు. పురాణాల ప్రకారం.. కర్ణుడితో పాటు కల్కికి యుద్ధవిద్యలు నేర్పేది పరశురాముడే. 'కల్కి' సినిమాలో ప్రభాస్కు మిలట్రీ ట్రైనింగ్ ఇచ్చిన దుల్కరే. కాబట్టి దుల్కర్ పార్ట్ 2 లో పరశురాముడు రోల్ చేస్తాడు.పరశురాముడి రోల్ అంటే పవర్ ఫుల్ రోల్. ఆ రోల్ కి పవర్ ఫుల్ ఎలివేషన్స్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది. కాబట్టి దుల్కర్ కి సెకండ్ పార్ట్ లో ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయట. ఆ ఎలివేషన్స్ కి థియేటర్లు తగలబడి పోవడం పక్కా అట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: