కల్కి 2898 AD: ఏంటి బ్రో...కల్కీలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా వాడేశారా ?

Veldandi Saikiran
టాలీవుడ్‌ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కల్కి. 
ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదలైనప్పటి నుంచి పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో మహాభారతం నుండి మొదలై 2898 ఏడి వరకు సాగుతోంది. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ సృష్టించిన కాశి అనే మాయ ప్రపంచం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమాను 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమాను హిందూ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తీశారు. ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో  అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే  ప్రపంచవ్యాప్తంగా రూ. 191 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది రెండో రోజు కూడా మంచి రికార్డు స్థాయిలో కలెక్షన్ రాబట్టింది.

దీని ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు అన్నీ కలుపుకుంటే సినిమా మొత్తం దాదాపు రూ. 300 కోట్ల రూపాయలకు చేరువలో ఉన్నాయి. ఇక రెండో రోజున రూ. 298.5 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు మూవీ టీం ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో నటించిన నటీనటులలో మరొక కొత్త పాత్ర బయటకు వచ్చింది. ఇందులో సంతోష్ నారాయణన్ కూడా నటించారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇందులో ఇతని పాత్ర కేవలం కొద్ది సెకండ్లు మాత్రమే ఉండడంతో పెద్దగా కనిపించలేదు. ప్రభాస్ కాంప్లెక్స్ లోకి వెళ్లిన తర్వాత దిశా పటాని, ప్రభాస్ మధ్య ఓ పాట వస్తుంది. ఈ పాటలో సంతోష్ నారాయణన్ కనిపించాడు. కొద్ది సెకండ్ల పాటు ఇతని పాత్ర ఉండడంతో ఎవరికి పెద్దగా కనిపించలేదు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: